cinema updates today: దళపతి విజయ్ నటించిన 'బీస్ట్' సినిమాలోని 'జాలీ ఓ జింఖానా' సాంగ్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇదివరకూ ఈ సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుద్ రవిచంద్రన్ ఈ బీస్ట్‌కు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

కుర్ర హీరో సంతోష్ శోభన్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'శ్రీదేవి శోభన్‌బాబు' పేరుతో ఓ సినిమాను తీసుకొస్తున్నాడు. బుధవారం ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

నిఖిల్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం '18 పేజెస్'. ఈ సినిమా మే 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచారంలో భాగంగా సినిమా 'గ్లింప్స్'ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి దర్శకత్వం సూర్య ప్రతాప్ వహిస్తున్నారు. బన్ని వాసు నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ భామల కాల్షీట్లు ఫుల్.. ఇక సెట్లో హీరోలతోనే..