ETV Bharat / entertainment

పుష్ప 2, RC 15, ఇండియన్​ 2.. ఇప్పుడన్నీ ఆఫర్స్ అతడికే! - ప్రేమ్ రక్షిత్​ ఆర్​ సీ15

కొరియోగ్రాఫర్​ ప్రేమ్​ రక్షిత్​ ప్రస్తుతం వరుస స్టార్ హీరోల సినిమాలతో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్​తో రూపొందుతున్న చిత్రాలన్నింటికీ ఆయన పనిచేస్తున్నారు. ఆ వివరాలు..

Premrakshit
ప్రేమ్ రక్షిత్​ లైనప్​.. సౌత్​ స్టార్ హీరోస్​ అందరూ మనోడితోనే..​
author img

By

Published : Feb 15, 2023, 4:44 PM IST

ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన నాటు నాటు సాంగ్ స్టెప్పులతో ప్రపంచ సినీ ప్రియుల్ని ఊర్రూతలూగించారు. ఇటీవలే ఈ పాట గ్లోబల్​ అవార్డ్స్​తో పాటు ఆస్కార్ పురస్కారానికి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ ఘనతతో మంచి జోష్​లో ఉన్న రక్షిత్​.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. దర్శకనిర్మాతలు, హీరోలందరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూపుతున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్​తో రూపొందుతున్న స్టార్ హీరోల సినిమాలన్నింటికీ పనిచేస్తున్నారు. రీసెంట్​గా ఆయన నృత్యరీతులు సమకూర్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డిలో 'మాస్ మొగుడొచ్చాడే' పాట, నాని 'దసరా'లోని ధూమ్​ ధామ్ దోస్తాన్​ పాట కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇలా అన్ని వరసుగా సూపర్​ హిట్​ సాంగ్​లకు ఆయననే కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్​ పుష్ప 2, దిగ్గజ దర్శకుడు శంకర్​ రూపొందిస్తున్న రామ్​చరణ్ ఆర్​ సీ15, కమల్​హాసన్​ ఇండియన్​ 2, మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్​కు పనిచేస్తున్నారు. అలా ఈ అన్ని సినిమాల్లో ఒక్కో పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఇకపోతే గతంలో ప్రేమ్​ రక్షిత్​.. కొరియోగ్రాఫర్ అవ్వకుముందు ప్రభుదేవా, లారెన్స్, రాజు సుందరం వంటి డ్యాన్స్ మాస్టర్స్​కు అసిస్టెంట్​గా ఎన్నో సినిమాలు చేశారు. అలా 2005లో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాతో కొరియోగ్రాఫర్​గా మారారు. ఆ తర్వాత విక్రమార్కుడు, యమదొంగ సహా పలు జక్కన్న చిత్రాలకు పని చేశారు. ఇంకా చాలా మంది దర్శకులతో పలు సూపర్​ హిట్​ సాంగ్​లకు కొరియోగ్రఫీ చేశారు.

ఇదీ చూడండి: SSMB 28: త్రివిక్రమ్ ప్లాన్ ఛేంజ్​.. ​'కేజీయఫ్​'​ రేంజ్​లో యాక్షన్​ సీక్వెన్స్ చేసి కూడా.. ​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.