Chiranjeevi VV Vinayak : సోషల్‌మీడియాలో మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ రచ్చ ఎక్కువైపోయింది. అంతా డిజాస్టర్ ట్రోల్సే కనపడుతున్నాయి. ఈ మూవీ రిజల్ట్‌తో చిరు నెక్ట్స్ స్టెప్ అంతా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఎలాగో ఈ భోళాశంకర్ తర్వాత తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత చిరు ఏ దర్శకుడితో చేయనున్నారా అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే లైనప్‌లోకి పలువురు దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సీనియర్ యాక్షన్ దర్శకుడు పేరు తెరపైకి రావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన మరెవరో కాదు వివి వినాయక్.
చిరు రీఎంట్రీ ఖైదీ నెం.150 వివి వినాయక్ దర్శకత్వంలోనే జరిగిందన్న సంగతి తెలిసిందే. చిరుకు మంచి బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించారాయన. గతంలో ఆది, ఠాగూర్, అదుర్స్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను అందుకున్న ఆయన.. రీసెంట్గా బాలీవుడ్ అరంగేట్రం చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు. కానీ అది భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో వినాయక్‌కు తన స్టామినా ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన అంతగా ఫామ్‌లో లేరు. పెద్ద హీరోలు ఎవరూ ప్రస్తుతం ఆయనతో చేయట్లేదు. ఇలాంటి పరిస్థితిలో చిరు నిజంగానే వినాయక్‌కు అవకాశం ఇస్తే.. ఎలాంటి కథలో వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Bimbisara Chiranjeevi : ఇకపోతే ఇప్పటికే వివి వినాయక్ పేరు ప్రచారంలోకి రాకముందు.. చాలా రోజుల నుంచి మెగా 157ను బింబిసార దర్శకుడు విశిష్టతో చిరు చేయనున్నారని బాగా ప్రచారం సాగింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సోషియో ఫ్యాంటసీ మూవీగా ఇది రాబోతుంది ఇన్సైడ్ టాక్ వినిపించింది. మరి ఇప్పుడు చిరు యంగ్ డైరెక్టర్ విశిష్టకు అవకాశం ఇస్తారా లేదా సీనియర్ దర్శకుడు వివి వినాయక్‌తో చేస్తారా అనేది చూడాలి. లేదంటే ఒకరి తర్వాత ఇంకొకరిని లైన్లో పెడతారో..
Chiranjeevi Akhil Socio Fantasy Movies : చిరు-అఖిల్.. ఈసారి యూవీ క్రియేషన్స్ పరిస్థితేంటో?
Bhola Shankar Collection Day 2 : భోళాశంకర్ కలెక్షన్స్ డ్రాప్.. ఇక అల్లు అరవింద్ దిగాల్సిందే!