ETV Bharat / entertainment

వాల్తేరు వీరయ్య సినిమా రేటింగ్​పై చిరు ఫన్నీ కామెంట్స్ - chiranjeevi funny comments on walteru

సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రానికి అంతటి విజయాన్నిఅందించిన అభిమానులకు చిరు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటే ఆయన సినిమాపై పలు వెబ్​సైట్లు ఇచ్చిన రేటింగ్​లపై ఫన్నీ కామెంట్స్ చేశారు.

Chiranjeevi jokes on Waltheru Veeraiya movie rating
వాల్తేరు వీరయ్య సినిమా రేటింగ్​పై చిరంజీవి జోక్స్
author img

By

Published : Jan 23, 2023, 2:01 PM IST

'వాల్తేరు వీరయ్య' చిత్రానికి పలు వెబ్​సైట్లు ఇచ్చిన రేటింగ్​పై మెగాస్టార్ చిరంజీవి ఫన్నీ కామెంట్లు చేశారు. అయితే ఆయన ఎవర్నీ విమర్శించే ఉద్దేశంతో ఆ జోకులు వేయటం లేదని తెలిపారు. కేవలం వినోదం కోసం మాత్రమే చెబుతున్నానని అన్నారు. 'వాల్తేరు వీరయ్య' యూఎస్ ప్రీమియర్స్ చూసిన పలు వెబ్​సైట్లు రివ్యూలు రాశారు. కొంతమంది ఈ మూవీకి 2.5 రేటింగ్ ఇచ్చారు.

అయితే ఆ రేటింగ్ గురించి చిరు మాట్లాడుతూ.. "వాటిని చూసి బాధపడకూడదని అనుకున్నాను. ఎందుకంటే నా సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. 'ఘరానా మొగుడు', 'గ్యాంగ్ లీడర్', 'రౌడీ అల్లుడు', 'అన్నయ్య' సినిమా తర్వాత ఈ చిత్రం అంతటి పూర్తిస్థాయి ఎంటర్​టైన్​మెంట్ ఇచ్చింది. కాబట్టి వాళ్లు ఇచ్చిన రేటింగ్​ను పట్టించుకోకూడదని అనుకున్నాను. అయితే 2.5 అంటే 2.5 మిలియన్ల డాలర్లని నాకు తర్వాత తెలిసింది. యూఎస్​లో అంత రెవెన్యూ వస్తుందని వాళ్లు ముందే చెప్పారు. కాని మేమే పొరపాటు పడ్డామని తెలిసింది" అని ఆయన అంటూ నవ్వులు పూయించారు.

'వాల్తేరు వీరయ్య' చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటించారు. కేథరిన్, శ్రుతిహాసన్, ప్రకాశ్​రాజ్, బాబీ సింహా, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జనవరి 13న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. యూఎస్​ఏలోనూ ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే అమెరికాలో ఈ మూవీ 2 మిలియన్ డాలర్ల క్లబ్​లో ప్రవేశించింది. ఈ విషయంపై చిరు ఆనందం వ్యక్తం చేస్తూ.. అమెరికాలో నివసిస్తున్న పలువులు అభిమానులతో జూమ్ కాల్​లో మాట్లాడారు. ఈ చిత్రానికి భారీ విజయాన్ని అందించిన అభిమానులకు ఆయన కృజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.