ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం 'గోల్డెన్ గ్లోబ్' అందడం పట్ల అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. ఈమేరకు సంగీత దర్శకుడు కీరవాణి, చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. "ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటునాటు'కు గానూ కీరవాణి గోల్డెన్‌గ్లోబ్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే 'నాటునాటు'. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. చరణ్ తారక్ తోపాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు కంగ్రాట్స్" అని పేర్కొన్నారు.
- "కంగ్రాట్స్ సర్ జీ. నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో పాటలకు డ్యాన్స్ చేశాను. కానీ, 'నాటు నాటు' ఎప్పటికీ నా హృదయానికి చేరువగానే ఉంటుంది" - ఎన్టీఆర్
- "ఇదొక అద్భుతమైన మార్పు. భారతీయులందరూ ముఖ్యంగా మీ అభిమానుల తరఫున కీరవాణి, రాజమౌళి, చిత్రబృందం మొత్తానికి అభినందనలు" - ఏ ఆర్ రెహమాన్
- "ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న కీరవాణికి హృదయపూర్వక అభినందనలు. 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా" - క్రిష్
ప్రధాని మోదీ ప్రశంసలు..
'ఆర్‌ఆర్‌ఆర్'ను అంతర్జాతీయ పురస్కారం వరించిన నేపథ్యంలో చిత్రబృందానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గోల్డ్ అవార్డును నాటు నాటు పాట కైవసం చేసుకోవడంపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రాజమౌళి, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణిలకు అభినందనలు తెలియజేశారు. అవార్డు ప్రకటన అనంతరం చిత్ర బృందం కేరింతలకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్ పోస్టుకు జత చేశారు.
![prime minister narendra modi tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_modi.png)
![anushka shetty tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_4.jpg)
![nandini reddy tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_6.jpg)
![nagarjuna tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_2.jpg)
![manchu mohan babu tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_1.jpg)
![vishnu manchu tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_5.jpg)
![ravi teja tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_8.jpg)
![devisri prasad tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_3.jpg)
![allari naresh tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_10.jpg)
![ramgopal varma tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_7.jpg)
![rahul ravindran tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17453617_9.jpg)