ETV Bharat / entertainment

చిల్డ్రన్స్​ డే స్పెషల్​.. కొడుకుతో హీరో నాని రచ్చ మామూలుగా లేదుగా! - హీరో నాని అప్డేట్లు

చిల్డ్రన్స్‌ డే సందర్భంగా నేచురల్​ స్టార్​ నాని.. తన కుమారుడు అర్జున్​తో కలిసి అమెరికాలోని డిస్నీల్యాండ్​లో రచ్చరచ్చ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

hero nani
hero nani
author img

By

Published : Nov 14, 2022, 6:31 PM IST

Hero Nani Childrens Day Video: నేచులర్‌ స్టార్‌ నాని తన కుమారుడు అర్జున్​తో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ సమయంలో కుమారుడితో సరదాగా ఆడుకుంటున్న వీడియోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. సోమవారం చిల్డ్రన్స్‌ డే సందర్భంగా కుమారుడితో నాని సరదాగా గడిపారు. షూటింగ్స్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి అమెరికాకు చెక్కేశారు. తనయుడితో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌లో సందడి చేశారు.

hero nani
కుమారుడితో నాని

అక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్‌నర్స్ స్టాచ్యూ ముందు నాని, అర్జున్‌ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. అర్జున్‌ మిక్కీ మౌస్‌లా డ్రెస్‌ వేసుకుని.. క్యూట్‌ క్యూట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాని తన ఇన్‌స్టాగ్రామ్​ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నాని పోస్ట్‌ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.