ETV Bharat / entertainment

రామోజీ ఫిల్మ్​సిటీలో 'చంద్రముఖి-2' సందడి.. మరో కొత్త దర్శకుడితో నాని! - chandramukhi 2 movie lawrence

అప్పట్లో ఘన విజయం సాధించిన 'చంద్రముఖి' సినిమా సీక్వెల్​ 'చంద్రముఖి-2' షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగుతోంది. మరోవైపు, కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ముందుండే హీరో నాని.. మరో డైరెక్టర్​ను తెరకు పరిచయం చేయనున్నారని సమాచారం.

chandramukhi shooting in ramoji filmcity and hero nani with new director

author img

By

Published : Oct 16, 2022, 9:01 AM IST

Chandramukhi 2 Shooting: 'చంద్రముఖి' సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అప్పుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్ర పోషిస్తే ఈసారి లారెన్స్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. లారెన్స్‌, రాధిక, వడివేలు తదితరులపై ఓ ఇల్లు నేపథ్యంగా సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. తొలి చిత్రం ఘన విజయం సాధించడంతో సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.

కొత్త దర్శకుడితో నాని..
కొత్తదనం నిండిన కథల్ని.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన 'దసరా' చిత్రంతో సెట్స్‌పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. దీనితో శ్రీకాంత్‌ ఓదెల అనే నూతన దర్శకుడ్ని తెరకు పరిచయం కానున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు ప్రకటించలేదు. ఇప్పుడీ విషయంలో ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన చేయనున్న తర్వాతి సినిమాని మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో నాని ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ద్విజగా అమలాపాల్​..
ఓవైపు భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తూనే.. మరోవైపు పరిమిత బడ్జెట్‌లో ప్రయోగాత్మక చిత్రాలూ నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ. ఇప్పుడీ సంస్థలో అమలాపాల్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మితమవుతోంది. ఐజాజ్‌ ఖాన్‌ దర్శకుడు. ఎల్లనార్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్స్‌, విఆర్‌సీసీ ఫిల్మ్స్‌ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సినిమాకి ‘ద్విజ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇటీవలే చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. స్త్రీ విముక్తికి సంబంధించిన శక్తిమంతమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. సంఘంలోని అసమానతలకు వ్యతిరేకంగా ఓ మహిళ చేసే పోరాట గాథగా సాగుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి: అందంతో పాటు ఆటతో ఆకట్టుకుంటున్న భామలు వీరే

పోలీస్‌ కథలు.. యాక్షన్‌ మొదలు.. సత్తా చాటేందుకు స్టార్​ హీరోలు రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.