Chandramukhi 2 Opening Day Collections : సూపర్ స్టార్ రజనీకాంత్ - పి.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో సినీ ప్రియులకు తెలిసిన విషయమే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న (Chandramukhi 2 Movie Review) థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ సారి ప్రధాన తారాగణం మారిపోయింది. రజనీ కాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా కనిపించారు. చంద్రముఖి పాత్రను కంగనా రనౌత్ పోషించింది. అయితే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమా తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్రానికి తొలి రోజు కలెక్షన్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. డిసెంట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళంలో ఈ చిత్రానికి 51.90 ఆక్యూపెన్సీ దక్కగా.. తెలుగు, హిందీలో 42.65, 12.77 ఆక్యూపెన్సీ నమోదైనట్లు పేర్కొన్నాయి. తొలి రోజు అన్ని భాషల్లో కలిపి రూ.7.5కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఓపెనింగ్స్ ఎక్స్‌లెంట్‌గా ఉన్నాయంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
Chandramukhi 2 Movie Review : ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే.. కంగనా - లారెన్స్ నటన, చంద్రముఖి - వేటయ్యరాజుల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, పతాక సన్నివేశాలు సినిమాకు బలంగా ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రధమార్ధం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేకపోవడం, ఊహలకు తగ్గట్లుగా కథనం సాగడం చిత్రానికి బలహీనతలు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ చంద్రముఖి మరి ఎక్కువగా భయపెట్టడం కానీ థ్రిల్ పంచడం కానీ చేయలేదంట! ఇకపోతే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందించారు. ఆర్.డి.రాజశేఖర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ చిత్రాన్ని నిర్మించారు.
-
The time has finally arrived! 👀 You can now peek behind the Chandramukhi-2 door and unravel the mysteries surrounding it! 🚪🫴🏻🔥 Are you ready for the epic face-off? 🏇🏻🗡️#Chandramukhi2 🗝️ is now at cinemas near you! 🎟️🍿📽️#PVasu @offl_Lawrence @KanganaTeam @mmkeeravaani… pic.twitter.com/CQd6GKrtVt
— Lyca Productions (@LycaProductions) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The time has finally arrived! 👀 You can now peek behind the Chandramukhi-2 door and unravel the mysteries surrounding it! 🚪🫴🏻🔥 Are you ready for the epic face-off? 🏇🏻🗡️#Chandramukhi2 🗝️ is now at cinemas near you! 🎟️🍿📽️#PVasu @offl_Lawrence @KanganaTeam @mmkeeravaani… pic.twitter.com/CQd6GKrtVt
— Lyca Productions (@LycaProductions) September 28, 2023The time has finally arrived! 👀 You can now peek behind the Chandramukhi-2 door and unravel the mysteries surrounding it! 🚪🫴🏻🔥 Are you ready for the epic face-off? 🏇🏻🗡️#Chandramukhi2 🗝️ is now at cinemas near you! 🎟️🍿📽️#PVasu @offl_Lawrence @KanganaTeam @mmkeeravaani… pic.twitter.com/CQd6GKrtVt
— Lyca Productions (@LycaProductions) September 28, 2023
Chandramukhi 2 Review : 'చంద్రముఖి -2'.. ప్రేక్షకులను భయపెట్టిందా ?
Skanda Movie Review : రామ్-బోయపాటి కాంబినేషన్ మెప్పించిందా?