ETV Bharat / entertainment

Bro Movie Trailer : 'బ్రో' సినిమా ట్రైలర్ వచ్చేసిందోచ్.. మీరు చూశారా? - people media factory

Bro Movie Trailer : పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​-మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్​ సినిమా 'బ్రో'. ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది మూవీ యూనిట్​. మరేందుకు ఆలస్యం మీరు చూసేయండి పవర్​ప్యాక్​ 'బ్రో' ట్రైలర్​.

Bro Movie Trailer
బ్రో సినిమా ట్రైలర్ విడుదల
author img

By

Published : Jul 22, 2023, 6:17 PM IST

Updated : Jul 22, 2023, 6:59 PM IST

Bro Movie Trailer : పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​-మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా​ 'బ్రో'. ఈ సినిమా ట్రైలర్​ను మూవీయూనిట్ శనివారం విడుదల చేసింది. అయితే 'బ్రో'.. తమిళ సినిమా 'వినోదయ సీతం' సినిమాకు రీమేక్​. అయితే ఒరిజినల్​లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖనియే.. తాజాగా 'బ్రో' సినిమాను తెరకెక్కించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదల కానుంది. మరి 'బ్రో' సినిమా ట్రైలర్ మీరూ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మనుషులందరూ భస్మాసురుడి వారసులు అంటూ.. పవర్ స్టార్ వాయిస్​తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో తేజ్​కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. పవన్ కల్యాణ్ అతడికి దర్శనమిస్తారు. ఇక అప్పటి నుంచి పవన్, తేజ్ కలిసి సినిమాలో స్క్రీన్ చేసుకుంటారని ట్రైలర్ చూస్తే​ తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందాన్ని మళ్లీ.. కమెడియన్ పాత్రలో తెరపై చూడనున్నాం. అయితే.. పవన్ కల్యాణ్ హిట్ పాటలు ఈ సినిమా అఖర్లో ఓ సన్నివేశంలో ఉన్నట్లు ట్రైలర్​లో చూపించారు. దీంతో ఇక థియేటర్లో మాస్ జాతరే అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే విజిలేస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్​తో కూడిన 'బ్రో' జులై 28 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

Bro Movie Cast : ఇక ఈ సినిమాలో సాయి ​తేజ్ సరసన కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్​గా నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఒరిజినల్​ స్టోరీలో మార్పులు చేసి తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​లో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కాగా తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

అయితే శనివారం రిలీజైన బ్రో ట్రైలర్ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నిలిచింది. కేవలం 45 నిమిషాల్లోనే మిలియన్​ వ్యూస్​తో దూసుకుపోతోంది. కాగా ఇప్పటికే ఈ ట్రైలర్​కు లక్షా డెభైవేల లైక్స్ వచ్చాయి.

Last Updated : Jul 22, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.