ETV Bharat / entertainment

''బ్రో' కోసం పవన్ ఉపవాసం.. ఈ సినిమాకు ఆయనే స్ఫూర్తి' - bro director interview

BRO Movie Director : 'బ్రో' సినిమా దర్శకుడు సముద్రఖని రీసెంట్​గా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు..

bro movie director interview
బ్రో సినిమా కోసం పవన్ ఉపవాసం
author img

By

Published : Jul 24, 2023, 9:09 PM IST

Updated : Jul 24, 2023, 10:38 PM IST

BRO Movie Director : 'బ్రో' సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ చాలా కష్టపడ్డారని.. చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఉపవాసం ఉన్నారని డైరెక్టర్ సముద్రఖని తెలిపారు. అయితే పవన్ కల్యాణ్​ బ్రో కథ విన్న మూడు రోజుల్లోనే షూటింగ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఒక డైరెక్టర్​గా తాను ఎంత క్లారిటీతో ఉన్నానో.. పవన్​కు తొలిరోజు షూటింగ్​లోనే అర్థమయ్యిందని అన్నారు. అయితే ఉన్న సమయాన్ని కాలక్షేపం చేస్తూ వృథా చేయకుండా.. సెట్​లోనే పవన్ కాస్ట్యూమ్స్ మార్చుకునేవారని ఆయన పేర్కొన్నారు. షూటింగ్​లో పాల్గొన్నన్ని రోజులు ఉపవాసంతో, నిష్ఠతో పనిచేశారని సముద్రఖని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్​ సైతం కీలక పాత్రలో నటించారు.

ప్రాజెక్ట్​లోకి పవన్ - త్రివిక్రమ్ ఎంట్రీ..
'మనం ఏ పని చేయాలన్నా.. కాలం నిర్ణయిస్తుంది. నేను చేసిన 'వినోదయ సిత్తం' రిలీజైన దాదాపు వారం రోజులకు ఓ వృద్ధుడు నాకు ఫోన్ చేశాడు. సినిమా చూసిన ఆ పెద్దాయన ఎంతో ఎమోషనల్ అయ్యి నాతో మాట్లాడారు. అలా మనుషులకు దగ్గరయ్యే ఈ సినిమా తెలుగులో త్రివిక్రమ్ గారి సహకారంతోనే సాధ్యమైంది. అయితే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే పవన్ కల్యాణ్​తో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ అన్నారు. ఆయన మాటతో చెప్పలేనంత సంతోషం కలిగింది. అలా ఈ సినిమాలోకి త్రివిక్రమ్, పవన్ కల్యాణ్​ వచ్చారు' అని సముద్రఖని అన్నారు.

కాగా ఈ సినిమాను కేవలం 53 రోజుల్లోనే పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఆయన సినిమాల్లో ఇదే అత్యుత్తమ సినిమా అని చెప్పుకొచ్చారు. అయితే బ్రో అంత పర్​ఫెక్ట్​గా రావడానికి డైరెక్టర్ త్రివిక్రమ్​ కూడా ఒక కారణమని గుర్తుచేశారు. త్రివిక్రమ్ తనకు ఒక కుటుంబ సభ్యుడిగా తోడున్నాడని సముద్రఖని తెలిపారు.

'బ్రో' కు స్ఫూర్తి..
డైరెక్టర్ సముద్రఖని, ఆయన గురువు బాలచందర్​తో కలిసి 2004లో ఓ డ్రామా చూశారట. అప్పటి నుంచి ఆ కథ ఆయనతోనే ట్రావెల్ చేస్తుందని అన్నారు. ఆ డ్రామా కథ ఆధారంగానే 'వినోదయ సిత్తం' సినిమా తీసినట్లు తెలిపారు. తాజాగా తెలుగులో చేసిన ప్రయత్నమే ఈ బ్రో సినిమా అని పేర్కొన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జులై 28న గ్రాండ్​గా విడుదల కానుంది.

Last Updated : Jul 24, 2023, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.