ETV Bharat / entertainment

బాహుబలి గిమ్మిక్కు అన్ని సినిమాలకు వర్క్​అవుట్​ అవుతుందా? - attack collections

ఒకప్పుడు.. హిట్​ అయిన సినిమాకు.. సీక్వెల్ తీయడానికి ఆసక్తి చూపేవారు దర్శక,నిర్మాతలు. బాహుబలి రాకతో సీక్వెల్​ ట్రెండ్​ మారింది. కథను ముందుగానే విడదీసి.. పార్ట్​-1, పార్ట్​-2 లాగా వీలైనన్ని భాగాలను తెరకెక్కించి.. ప్రేక్షకులను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలా వస్తున్న సినిమాలు ఏవీ? అన్ని సినిమాలకు ఆ లాజిక్​ వర్క్​అవుట్​​ అవుతుందా?

Brahmastra
పుష్ప
author img

By

Published : Apr 9, 2022, 10:00 PM IST

Updated : Apr 9, 2022, 11:02 PM IST

భారతీయ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సినిమాలు విడుదలై.. హిట్​ అయిన తర్వాతే.. వాటికి సీక్వెల్​ తీసేవారు. సర్కార్​, హౌస్​ఫుల్​, క్రిష్​ లాంటి కొన్ని మూవీలు ఇలా వచ్చినవే. ​అయితే ఇప్పుడు ట్రెండ్​ మారింది. సౌత్​, నార్త్​ మధ్య గీతలు చెరిగిపోయి.. ప్రాంతీయ సినిమా.. పాన్​ ఇండియా సినిమాగా ఎదిగింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు స్టార్స్​ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన తర్వాత సీక్వెల్ కాకుండా.. కథను ముందుగానే భాగాలుగా విడదీస్తున్నారు. పార్ట్​-1, పార్ట్​-2 లాగా సినిమాను విడుదల చేస్తున్నారు. పార్ట్​-1 పాత్రలు పరిచయం చేసి.. చివర్లో ఓ ట్విస్ట్ పెట్టి..​ అసలు కథ పార్ట్​-2లో చెబుతున్నారు. ఫలితంగా ప్రేక్షకులను ఆకర్షించి.. వీలైనంత వరకు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదటి భాగం విడుదలైన తర్వాత.. దానికి వచ్చే ఆదరణను చూసి.. రెండో భాగాన్ని మరింత పవర్​ఫుల్​గా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి నుంచి ఈ ట్రెండ్​ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు రెండు, మూడు భాగాలుగా వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేజీయఫ్​ పార్ట్​-1 విడుదులై సంచలన విజయం సాధించగా.. చాప్టర్​-2 ఈ నెల 14న విడుదల కానుంది. అల్లు అర్జున్​ 'పుష్ప', జాన్​ అబ్రహం 'అటాక్' సినిమాల రెండో భాగం సిద్ధమవుతుండగా.. రణ్​బీర్​ కపూర్ నటించిన ​'బ్రహ్మాస్త్ర' మూడు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది.

brahmastra
బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర: రణ్‌బీర్ కపూర్​, ఆలియాభట్‌ ప్రధానపాత్రల్లో భారతీయ సినీపరిశ్రమ చరిత్రలో భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న చిత్రాల్లో 'బ్రహ్మాస్త్ర' ఒకటి. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని తొలి భాగం చిత్రీకరణ మార్చి 29న పూర్తిచేసుకుంది. దాదాపు 5 ఏళ్లకు పైగా ఈ షూటింగ్​ జరిగింది. ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు.. టాలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు నాగార్జున, మౌనీ రాయ్​లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రణ్​బీర్​ శివుడిగా, మానవాతీత శక్తులు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నారు.

'బ్రహ్మాస్త్ర' సినిమాపై ఇటీవలే స్పందించారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. మూడు భాగాలు వచ్చే ఈ సినిమా భవష్యత్తు.. మొదటి భాగంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మొదటి భాగం ఫలితాన్ని బట్టి.. పార్ట్​-2పై మరింత లోతుగా ఆలోచిస్తామని చెప్పుకొచ్చారు.

"బ్రహ్మాస్త్ర.. భారతీయ సంస్కృతి నుంచి ప్రేరణ పొంది తీసుకున్న చిత్రం. యువతకు హత్తుకుపోయే సినిమా అవుతుంది."

-అయాన్ ముఖర్జీ, దర్శకుడు

అల్లు అర్జున్​ 'పుష్ప' మొదటి భాగం ఇప్పటికే విడుదలై హిట్​ టాక్​ సాధించింది. దీంతో పార్ట్​-2పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్​.. హిందీలో గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చారు. మొదటి భాగానికి మించి.. పార్ట్​-2 విజయం సాధిస్తుందనే అంచనాతో ఉంది చిత్ర యూనిట్​.

pushpa
పుష్ప
బాలీవుడ్​ హీరో జాన్​ అబ్రహం.. చాలా రోజుల తర్వాత 'అటాక్' రూపంలో హిట్​ అందుకున్నారు. పార్ట్​-2కు ఇప్పటికే కథను సిద్ధం చేసిన చిత్రబృందం త్వరలో.. షూటింగ్​ను ప్రారంభించనుంది. వీలైతే దీనికి మూడో భాగాన్ని కూడా తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారు జాన్​ అబ్రహం. మొదటి భాగంలో పాత్రల ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పారు డైరెక్టర్​ ఆనంద్​. ​రెండు, మూడు భాగాల్లో ఆ కథను కొనసాగించనున్నారు.
attack
అటాక్​

నిపుణులు ఏం అంటున్నారంటే..

దర్శకధీరుడు రాజమౌళి వల్లే భారతీయ సినిమాలో ఈ మార్పు వచ్చినట్లు చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. పార్ట్​-1 ఆరంభం, పార్ట్​-2 ముగింపు అనే ప్రాథమిక సూత్రాలతో.. బాహుబలిని తీసి.. రాజమౌళి ఆల్​టైమ్​ హిట్​ కొట్టారు. ఈ విజయం మిగతా దర్శకులను కూడా ఆలోచింపజేసినట్లు ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి భాగం హిట్ అయితే.. ఆ తర్వాత విడుదల చేసే భాగాలకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ పార్ట్​ -1 విషయంలో అంచనాలు తలకిందులైతే.. ఆ తర్వాత వచ్చే.. భాగాలపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. వాటిని తెరకెక్కించేందుకు సాహించరని అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత మిగిలిన భాగం ఎప్పుడనే ప్రశ్నలు ఎదురైతే దర్శక, నిర్మాతలు సమాధానాలు వెతుక్కుంటారని అంటున్నారు. కథ సిద్ధం కాలేదనో.. నటీనటులు బిజీగా ఉన్నారనో చెప్పే అవకాశమూ లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

ఇది చదవండి: మెగాస్టార్ ఆచార్య ట్రైలర్​.. బాలీవుడ్​లోకి తేజ.. 'సలార్' సర్​ప్రైజ్

Last Updated : Apr 9, 2022, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.