ETV Bharat / entertainment

రామ్-శివకార్తికేయన్ మల్టీస్టారర్​.. 'పుష్ప-2'లో విజయ్ సేతుపతి! - పుష్ప 2

రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో రానున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మల్టీస్టారర్​గా తెరకెక్కనుందని, ఇందులో రామ్​తో పాటు తమిళ హీరో శివకార్తికేయన్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న 'పుష్ప-2'లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ram pothineni boyapati srinu
vijay sethupathi
author img

By

Published : Jun 27, 2022, 11:59 AM IST

మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమయ్యారు హీరో రామ్ పోతినేని. మాస్ డైరెక్టర్​ బోయపాటితో ఆయన చేయబోయే సినిమా మల్టీస్టారర్​ అని సమాచారం. ఇందులో రామ్​తో పాటు తమిళ హీరో శివ కార్తికేయన్​ కూడా నటించనున్నట్లు సమాచారం. మరో విశేషం ఏంటంటే.. ఎమోషనల్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్​ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 'అఖండ'తో మాంచి జోష్​లో ఉన్న బోయపాటి.. రామ్​కు భారీ విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.

ram pothineni boyapati srinu
రామ్-శివకార్తికేయన్

'పుష్ప-2'లో సేతిపతి!: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2'. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా మొదటి భాగం ఘన విజయాన్ని అందుకుంది. దీంతో రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే కథాకథనాల్లో సుకుమార్ పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

vijay sethupathi
'పుష్ప-2'లో విజయ్ సేతుపతి!

అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలి భాగంలోనే ఫహద్ ఫాజిల్ చేసిన పోలీస్ పాత్రలో ఆయన నటించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల కుదరలేదు. 'పుష్ప-2'లో సేతుపతి.. మరో సీనియర్ పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నట్లు వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

ఇదీ చూడండి: ప్రభాస్, దుల్కర్, నాని ఒకే ఫ్రేమ్​లో.. 'కేజీయఫ్​' దర్శకుడితో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.