ETV Bharat / entertainment

బాలయ్య, పవర్‌స్టార్‌తో ఆ బాలీవుడ్ హీరో ఫైట్.. ఎవరంటే? - బాలయ్య గోపీచంద్​ మలినేని సినిమా

Bobby Deol Tollywood Debut: బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ త్వరలో తెలుగులో అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రానున్న 'హరి హర వీర మల్లు', అనిల్ రావిపూడి-బాలకృష్ణ చిత్రంలో ఆయనే ప్రతినాయకుడిగా ఎంపికైనట్లు సమాచారం.

bollywood actor bobby deol will play villain roles in pawankalyan and balakrishna movies

author img

By

Published : Nov 3, 2022, 9:45 PM IST

Updated : Nov 3, 2022, 10:03 PM IST

Bobby Deol Tollywood Debut: బాలీవుడ్ హీరో బాబీ డియోల్.. హిందీలో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు. ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ నటుడు.. ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయాలని చూస్తున్నారు.

'ఎఫ్3'తో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న డైెరెక్టర్​ అనిల్ రావిపూడి.. బాలయ్యతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాబీ డియోల్‌ను ప్రతినాయకుడిగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఆయనను చిత్రబృందం సంప్రదించిందట. ఇందుకు బాబీ కూడా అంగీకరించారని సమాచారం. అనిల్ రావిపూడి-బాలయ్య కాంబోలో రాబోతున్న చిత్రంతో టాలీవుడ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బాబీ డియోల్ ఆశపడుతున్నారు.

మరోవైపు, క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​ హీరోగా తెరకెక్కుతోన్న 'హరి హర వీర మల్లు' చిత్రంలో కూడా బాబీ డియోల్‌ను విలన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రంలో ఈ రోల్ కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను తీసుకున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్స్ పదే పదే వాయిదా పడుతుండటంతో తన సమయాన్ని వృథా చేసుకోవడం ఇష్టం లేక ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో బాబీ డియోల్‌ను ఎంపిక చేశారట.

Last Updated : Nov 3, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.