Prabhas Lokesh Kanagaraj: 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఈ సినిమాతో రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఆ చిత్రం తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు రావడంతో డార్లింగ్ ఆశలన్నీ 'ఆదిపురుష్' సినిమాపైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు.
తాజాగా కమల్‌హాసన్‌కు 'విక్రమ్' సినిమా రూపంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్.. ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డార్లింగ్‌తో కలిసి ఆయన సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారట. అదేగానీ నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కాంబో విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇవీ చదవండి: చూసేందుకు 'భయమే' కానీ వినోదమే.. టాలీవుడ్లో కొత్త హంగులతో హారర్ చిత్రాలు!
టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ ఎవరో తెలుసా?