ETV Bharat / entertainment

'బింబిసార 2' పరిస్థితేంటి.. డైరెక్టర్​ మారినట్టేనా? - ramcharan ​ vasishta

Bimbisara 2 update : 'బింబిసార 2' దర్శకుడు వశిష్ట- హీరో కల్యాణ్​ రామ్​కు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

bimbisara 2 update
'బింబిసార 2' దర్శకుడు మారినట్టేనా?
author img

By

Published : Jul 4, 2023, 12:16 PM IST

Bimbisara 2 update : వరుస పరాజయాలతో సతమతమవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్​కు.. కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీ ఫిల్మ్ 'బింబిసార'. దీంతో రెండో భాగాన్ని తెరకెక్కిస్తామని కూడా ప్రకటించారు. ప్రముఖ జీ సంస్థ కూడా.. ఈ సెకండ్ పార్ట్​కు సంబంధించిన అన్ని రైట్స్​ కోసం రూ.వంద కోట్లు ఆఫర్ చేసిందట. దీంతో ఈ సినిమాను త్వరగా మూగించాలని కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నారట. ఇలాంటి సమయంలో ఆయనకు ఓ పెద్ద చిక్కు వచ్చి పడిందని తెలిసింది. చిత్ర దర్శకుడు వశిష్ట.. ఈ రెండో భాగం ప్రస్తుతానికి చేసేందుకు ఆసక్తిగా లేరని ప్రచరాం సాగుతోంది.

చిరంజీవి సినిమా కోసమేనా? వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ చెప్పి ఒప్పించారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమానే ఆయన తన రెండో చిత్రంగా రూపొందించాలని భావిస్తున్నారట. ఇది వర్కౌట్ అయితే ఆ తర్వాత మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​తోనూ ఓ సినిమా చేయొచ్చని భావనలో ఉన్నారట. అందుకే 'బింబిసార 2'ను కొంతకాలం పక్కనపెట్టి.. ముందుగా చిరంజీవితోనే చేయాలని డిసైట్​ అయ్యారట. అయితే ఈ నిర్ణయంపై కల్యాణ్ రామ్​ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అవసరమైతే మరో దర్శకుడితోనైనా ఈ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారట. 'రొమాంటిక్​' ఫేమ్​ అనిల్ పాడురికు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.

40 శాతం రెమ్యునరేషన్​ కోత.. దర్శకుడు వశిష్ట.. తన సెకండ్ మూవీగా 'బింబిసార 2'ను.. ఎన్టీఆర్​ ఆర్ట్స్ బ్యానర్​లో చేస్తానని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారంట. ఒకవేళ ఎన్టీఆర్​ ఆర్ట్స్​లో కాకుండా తన రెండో సినిమాను(బింబిసార 2 కాకుండా) ఇతర నిర్మాణ సంస్థలో చేస్తే.. 'బింబిసార 2' కోసం తీసుకునే రెమ్యునరేషన్​లో 40 శాతం​ వదులుకునేలా అగ్రీమెంట్​ చేసుకుని సంతకం చేశారట.

మరోవైపు దర్శకుడు వశిష్ట కూడా జరిగిన ఈ పరిణామాలన్నింటీపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. "కల్యాణ్​ రామ్​కు కెరీర్​లోని​ బిగ్గెస్ట్ హిట్​ అందించారు డైరెక్టర్​ వశిష్ట. అది ఎన్టీఆర్ ఆర్ట్స్​ బ్యానర్​లోనే. అయితే ఇప్పుడాయన జరిగిన ఒప్పంద విధానం, ఇతర పరిణామాల వల్ల అసంతృప్తిగా ఉన్నారు. అలానే ఇప్పటికే 'బింబిసార 2'కు సంబంధించి కొన్ని కీలకమైన వివరాలను కూడా నెరేట్​ చేశారు. ఇప్పుడా విశిష్ట చెప్పిన కీలక అంశాలతోనే బింబిసార 2ను కళ్యాణ్​ రామ్ రూపొందిస్తే.. అందుకు తగ్గ క్రెడిట్​ వశిష్టకు కూడా ఇవ్వాలి." అని వశిష్ట సన్నిహిత వర్గాలు చెప్పాయని బయట కథనాలు వస్తున్నాయి.

ఇదీ చూడండి :

బింబిసార్ 2 అప్డేట్​.. షూటింగ్​ షురూ అయ్యేది అప్పుడే

రామ్​చరణ్​ కొత్త మూవీ అప్డేట్​.. ఛాన్స్ కొట్టేసిన 'బింబిసార' డైరెక్టర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.