ETV Bharat / entertainment

మూడు నెలలు పవన్ కల్యాణ్​​తోనే ఉన్నా - ఆయనెప్పుడు నావాడే : బిగ్ బాస్ బ్యూటీ - అశ్విని శ్రీ పవన్ కల్యాణ్

Bigg Boss Ashwini Sree Pawan Kalyan : వర్ స్టార్​ పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేసింది బిగ్​బాస్​ బ్యూటీ అశ్విని శ్రీ. ప్రస్తుతం అవి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మూడు నెలలు పవన్ కల్యాణ్​​తోనే ఉన్నా - ఆయనెప్పుడు నావాడే : బిగ్ బాస్ బ్యూటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 3:36 PM IST

Bigg Boss Ashwini Sree Pawan Kalyan : బిగ్​బాస్​ ఏడో సీజన్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో అశ్విని శ్రీ ఒకరు. ఐదో వారంలో వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ 12వ వారం ఎలిమినేట్‌ అయ్యింది. హౌస్​లో పెద్దగా టాస్కులు, గేమ్స్‌ ఆడకపోయినా తన అందం, ఛార్మింగ్‌ లుక్స్​తో మంచి క్రేజ్‌ దక్కించుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేసింది.

'నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు'? అని యాంకర్ అడగగా - ఇది అందరికీ తెలిసిందే. "ఎప్పటికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారే నా ఫేవరెట్ హీరో" అని చెప్పింది. ఓజీ(OG Movie) సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంది. "పవన్ కల్యాణ్ ఎప్పుడు నా వాడే. ఈ సినిమా సూపర్ డూపర్​ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు దయవల్ల పవన్ కల్యాణ్ సీఎం అయితే రోజు స్క్రీన్​పై చూసుకోవచ్చు. సీఎం కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకువచ్చింది.

'పవన్ కల్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటి?' అని అడగగా - "ఆలోచిస్తే కూడా మాటలు రావడం లేదు. ఎందుకంటే ఆయనతో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో సార్ పక్కన కూర్చొపెట్టుకుని మాట్లాడేవారు. సెట్లో పవన్ కల్యాణ్​గారు తాను తినే డ్రై ఫ్రూట్స్ తినమ్మా అంటూ ఇచ్చేవారు. అంతే కాదు పాటలు పాడించే వారు. డ్యాన్స్ చేయించే వారు. ఆయన చాలా ఓపెన్​గా ఉంటారు. అందుకే ఆయన అంటే ఇష్టం" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్​పై అశ్విని శ్రీ చేసిన కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, అశ్విని శ్రీ బిగ్‌ బాస్​లోకి రాకముందు పలు తెలుగు సినిమాల్లో నటించింది. పవన్‌ కల్యాణ్​తో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, రవితేజతో రాజా ది గ్రేట్‌ వంటి హిట్‌ సినిమాల్లో తళుక్కున మెరిసింది. అయితే అప్పుడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

'సైంధవ్' బ్యూటీకీ కోహ్లీ బావ అవుతాడా? - సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.