మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తుంది మూవీ టీమ్. ఇప్పటికే ఇందులో 'వెన్నెల' కిశోర్, అర్జున్ దాస్, రష్మీ గౌతమ్, తులసిలు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ జాబితాలో చేరారు. ఆయనే అక్కినేని నట వారసుడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్. మార్చి 18వ తేదీన హీరో సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది చిత్రబృందం.
-
The #BholaaShankar family wishes the charming @iamSushanthA a very Happy Birthday❤️
— BholāShankar (@BholaaShankar) March 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The whole team is elated to have him aboard to play a Lover boy in a very special role🤗
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial pic.twitter.com/O4GAL4EJSy
">The #BholaaShankar family wishes the charming @iamSushanthA a very Happy Birthday❤️
— BholāShankar (@BholaaShankar) March 18, 2023
The whole team is elated to have him aboard to play a Lover boy in a very special role🤗
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial pic.twitter.com/O4GAL4EJSyThe #BholaaShankar family wishes the charming @iamSushanthA a very Happy Birthday❤️
— BholāShankar (@BholaaShankar) March 18, 2023
The whole team is elated to have him aboard to play a Lover boy in a very special role🤗
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial pic.twitter.com/O4GAL4EJSy
అయితే ఈ సినిమాలో హీరో సుశాంత్‌ది ఓ లవర్ బాయ్ క్యారెక్టర్ అంట. అంతే కాకుండా ఈయన చిరు సోదరి కీర్తి సురేశ్‌కు జోడీగా కనిపించనున్నారట. అయితే ఒరిజినల్ మూవీలో ఈ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందట. సుశాంత్ కోసం తెలుగులో ఈ పాత్ర నిడివిని మరింత పొడిగించారట. ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'రావణాసుర'లోనూ సుశాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారట. అయితే రావణాసురలో రవితేజ రోల్‌తో పాటు సుశాంత్ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని టాక్.
ఇక సినిమా విషయానికి వస్తే.. తమిళ హీరో అజిత్ నటించిన 'వేదాళం' చిత్రానికి రీమేక్‌గా భోళా శంకర్ సినిమా తెరకెక్కుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర, కె.ఎస్. రామారావుతో పాటు అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా కనిపించనున్నారట. అంతే కాకుండా 'ఖుషి' నడుము సీన్ కూడా రీ క్రియేట్ చేస్తున్నారని సమాచారం. అప్పటి ఐకానిక్ చిరు సాంగ్‌ను కూడా రీమేక్ చేసే పనిలో ఉందట మూవీ టీమ్. ఇప్పటికే ఈ చిత్రం చిరు అభిమానుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. దీంతో చిరు మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు.