ETV Bharat / entertainment

Bhola Shankar Movie Review : చిరు 'భోళా శంకర్‌' సినిమా ఎలా ఉందంటే.. - Bhola Shankar Movie hero

Bhola Shankar Movie Review : మెగాస్టార్​ చిరంజీవి లీడ్​ రోల్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్​'. శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే ?

Bhola Shankar Movie Review
భోళా శంకర్​ మూవీ రివ్యూ
author img

By

Published : Aug 11, 2023, 1:23 PM IST

Bhola Shankar Movie Review : మూవీ: భోళా శంకర్‌; స్టార్స్: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్​, సుశాంత్‌, తరుణ్‌ అరోడా, మురళీ శర్మ, షాయాజీ శిందే, రవి శంకర్‌, వెన్నెల కిశోర్​, శ్రీముఖి తదితరులు; మ్యూజిక్​: మహతి స్వర సాగర్‌; సినిమాటోగ్రఫీ: డడ్లీ; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌; నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కె.ఎస్‌.రామారావు; రచన: శివ, ఆది నారాయణ; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేశ్‌; విడుదల తేదీ: 11-08-2023

ప్రస్తుతం ఉన్న యంగ్​ హీరోస్​కు దీటుగా సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేర్‌ వీరయ్య'గా కనిపించి ఆకట్టుకున్న ఆయన.. తన మాస్‌ స్టామినాను చూపించి బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 'భోళా శంకర్‌' ఆడియన్స్​ ముందుకొచ్చారు. తమిళ బ్లాక్​ బస్టర్​ మూవీ 'వేదాళం'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఎలా ఉందంటే ?

క‌థేంటంటే: శంక‌ర్ (చిరంజీవి) త‌న సోద‌రి మ‌హాల‌క్ష్మి (కీర్తిసురేశ్‌)తో క‌లిసి కోల్​కతాలో ఉంటాడు. చ‌దువు కోసం చెల్లెల్ని అక్కడే ఓ కాలేజీలో చేర్పించి.. తాను టాక్సీ డ్రైవ‌ర్‌గా జీవితాన్ని మొద‌లుపెడ‌తాడు. మ‌హాల‌క్ష్మిని చూసి శ్రీక‌ర్ (సుశాంత్‌) లవ్​లో ప‌డ‌తాడు. ఇక ఓ వైపు ఆ ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉంటూనే.. మరోవైపు మాన‌వ అక్ర‌మ‌ర‌వాణాకి పాల్ప‌డుతున్న అలెగ్జాండ‌ర్ (త‌రుణ్ అరోరా) సోద‌రుల్లో ఒకొక్క‌రినీ అంతం చేయ‌డం మొద‌లుపెడ‌తాడు శంక‌ర్‌. ఆ విష‌యాన్ని క‌ళ్లారా చూస్తుంది శ్రీక‌ర్ సోద‌రి, క్రిమిన‌ల్ లాయ‌ర్ లాస్య (త‌మ‌న్నా). ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? మాన‌వ అక్ర‌మ ర‌వాణా ముఠాతో శంక‌ర్‌కి ఉన్న రివెంజ్​ ఏమిటి? అస‌లు శంక‌ర్ గ‌త‌ం ఏంటి ? మ‌హా, శ్రీక‌ర్ జంట పెళ్లి జ‌రిగిందా? లేదా అన్న విష‌యాలు తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే.

Bhola Shankar Review: ఎలా ఉందంటే: 'వేదాలం' రిలీజై ఎనిమిదేళ్ల‌వుతోంది. అటువంటి ఓ పాత క‌థ‌ను ఎంచుకుని, అంత‌కు మించిన పాత ప‌ద్ధ‌తుల‌తో ఓ సినిమాను తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుందో అదే... 'భోళాశంక‌ర్‌'. రీమేక్ అంటేనే చాలామంది సినీ ప్రేమికుల‌కి తెలిసిపోయిన క‌థ‌. అలాంటి ఓ క‌థ‌కి... క‌థ‌నం, భావోద్వేగాలు, హీరోయిజం పరంగా ఏమాత్రం కొత్త జోడింపులు లేకుండా, మేకింగ్‌లోనూ ఎక్క‌డా కొత్త‌ద‌నం లేకుండా తెర‌కెక్కిస్తే అది ప్రేక్ష‌కుల‌కి ఎలాంటి అనుభ‌వాన్నిస్తుందో ఇక మనం ఇట్టే ఊహించుకోవ‌చ్చు.

మానవ అక్ర‌మ రవాణా ముఠా చేస్తున్న దురాగ‌తాల‌తో ప్రారంభమయ్యే సినిమా... ఫస్ట్​ పార్ట్​ మొత్తం క‌ల‌క‌త్తా నేప‌థ్యంలోనే సాగుతుంది. టాక్సీ డ్రైవ‌ర్‌గా చిరంజీవి - టాక్సీ కంపెనీ ఓన‌ర్‌గా క‌నిపించే వెన్నెల కిశోర్ మ‌ధ్య ట్రాక్‌తో కామెడీ పండించాల‌ని ప్ర‌య‌త్నించినప్పటికీ అది ఆడియెన్స్​ను అంతలా ఆకట్టుకోలేదు. ఇక లాయ‌ర్ లాస్య పాత్ర‌లో త‌మ‌న్నాకీ, చిరంజీవికీ మ‌ధ్య స‌న్నివేశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. యాక్షన్​ సీన్స్​, సాంగ్స్ ఒక‌దాని వెంట ఒక‌టి వ‌స్తూనే ఉంటాయి. కానీ, అవి ప్రేక్ష‌కుల‌పై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌వు. ఒక్క సీన్​లోనూ నేచురాలిటీ ఇంటర్వెల్​ సమయంలో ఓ ట్విస్ట్​ ఉన్నప్పటికీ.. అప్ప‌టిదాకా సాగిన బోరింగ్ డ్రామా ప్ర‌భావం వల్ల ఆ స‌న్నివేశాలు ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌వు. అయితే సెకెండ్​ హాఫ్​ స్టార్ట్​ అయ్యాక కాస్త ఉప‌శమనం క‌లుగుతుంది.

Bhola Shankar Kushi Scene : ఫ్లాష్‌బ్యాక్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ బోలాగా చిరంజీవి క‌నిపించిన తీరు, ఆయ‌న త‌న‌దైన శైలిలో పండించిన హాస్యం అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తుంది. కీర్తి ఇంట్లో శ్రీముఖి, ముర‌ళీశ‌ర్మ‌, తాగుబోత ర‌మేశ్‌, గెట‌ప్ శ్రీను, బిత్తిరి స‌త్తి త‌దిత‌ర గ్యాంగ్‌తో క‌లిసి చిరంజీవి చేసిన స‌న్నివేశాలు కొన్ని మాత్రమే న‌వ్విస్తాయి. అయితే ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ని ఇమిటేట్​ చేయడం, ముఖ్యంగా శ్రీముఖితో క‌లిసి చేసిన 'ఖుషి' న‌డుము సీన్​ అభిమానులను న‌వ్వించ‌లేక‌పోయాయి. అలాంటి ప్ర‌య‌త్నాల‌కి చిరంజీవి దూరంగా ఉండ‌టం మంచిది. ఆయ‌న కాస్త స్టైలిష్‌గా, హుషారుగా క‌నిపించ‌డం ఒక్క‌టే ఈ సినిమాలో చెప్పుకోద‌గ్గ విష‌యం.

మరోవైపు అన్నాచెల్లెళ్ల బంధం, మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా క‌థ‌కి కీల‌కం అయిన‌ప్పుడు ఆ నేప‌థ్యంలో బ‌ల‌మైన భావోద్వేగాలు పండాలి. చిరంజీవిలాంటి ఓ స్టార్ క‌థానాయ‌కుడు ఉన్నా ఆ నేప‌థ్యంలో మ‌న‌సుల్ని తాకే ఒక్క స‌న్నివేశం కానీ సంభాష‌ణ కానీ లేదు. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతాయి. మెహ‌ర్ ర‌మేశ్ నుంచి దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చిన సినిమా ఇది. కావ‌ల్సినంత స‌మ‌యం దొరికినప్పటికీ ర‌చ‌న, మేకింగ్ ప‌రంగా ఏమాత్రం కొత్త ర‌క‌మైన క‌స‌ర‌త్తులు చేయ‌లేద‌న్న విష‌యం ఈ సినిమా స్ప‌ష్టం చేస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: చిరంజీవి త‌న‌దైన మాస్ మార్క్‌తో తెర‌పై క‌నిపించారు. పాట‌లు, యాక్షన్​ సీన్స్​లో త‌న‌వైపు నుంచి ఏమాత్రం త‌క్కువ కాకుండా చూసుకున్నారు. మంచి స‌న్నివేశం కుదిరితే త‌న టైమింగ్ ఎలా ఉంటుందో అని సెకెండ్​ హాఫ్​లో అక్క‌డ‌క్క‌డా చిరంజీవి చెప్ప‌క‌నే చెప్పారు. కానీ, ర‌చ‌న‌లోనే ఆ బ‌లం లేదు. చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేశ్‌కి ప్రాధాన్య‌మున్న పాత్రే ద‌క్కింది. ఆమె పాత్ర వ‌ల్లే అక్క‌డ‌క్క‌డా ఎమెషన్స్​ పండాయి. లాయ‌ర్ లాస్యగా క‌నిపించిన త‌మ‌న్నాకి పాట‌లు తప్ప పాత్ర ప‌రంగా పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

Chiranjeevi Bhola Shankar Cast : ఫస్ట్​ హాఫ్​లో వెన్నెల కిశోర్‌, ర‌ఘుబాబు లాంటి కామెడీ స్టార్స్​ ఉన్నప్పటికీ సీన్స్​ పండ‌లేదు. గెట‌ప్ శ్రీను, తాగుబోతు ర‌మేశ్‌, స‌త్య త‌దిత‌ర కామెడీ గ్యాంగ్ కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తారు. ష‌వ‌ర్ అలీ, త‌రుణ్ అరోరా, ప్ర‌ధాన విల‌న్లుగా క‌నిపిస్తారు. సాంకేతిక విభాగాల్లో డ‌డ్లీ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ పాట‌లు, నేప‌థ్య సంగీతం ప‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఉన్నాయి. సినిమాకి ర‌చ‌నే బ‌ల‌హీనం. క‌థ‌, క‌థ‌నాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతుంటాయి. మెహ‌ర్ ర‌మేశ్ మేకింగ్‌లో కొత్త‌ద‌నం ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. నిర్మాణం ప‌రంగా లోటుపాట్లేమీ క‌నిపించ‌వు.

  • బ‌లాలు
  • + చిరంజీవి - కీర్తి సురేశ్
  • + ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌, క‌థ‌నం
  • - పండ‌ని భావోద్వేగాలు
  • - కొత్త‌ద‌నం కొర‌వ‌డిన మేకింగ్‌
  • చివ‌రిగా: భోళాశంక‌ర్‌... బేలగా
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.