ETV Bharat / entertainment

Bhagvant Kesari Movie : గుడ్​ న్యూస్ చెప్పిన బాలయ్య.. ఇక థియేటర్లు మోతే.. ఫ్యాన్స్​ పండగ చేసుకోండి - భగవంత్ కేసరిలో కొత్త పాట

Bhagvant Kesari Movie : 'భగవంత్ కేసరి' మూవీటీమ్​ తమ సినిమా చూసేందుకు వస్తున్న ప్రేక్షకులకు ఓ సర్​ప్రైజ్​ ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని బాలయ్య చెప్పారు. ఆ వివరాలు..

Bhagvant Kesari Movie : గుడ్​ న్యూస్ చెప్పిన బాలయ్య.. ఇక థియేటర్లు మోతే

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 10:13 AM IST

Bhagvant Kesari Movie New song : నందమూరి నటసింహం బాలకృష్ణ- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి.. బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. దసరా విన్నర్​గా బ్లాక్​ బాస్టర్​ టాక్​తో మంచి వసూళ్లను అందుకుంటోంది. దీంతో మూవీటీమ్​.. సక్సెస్​ మీట్​ను హైదరాబాద్‌లో నిర్వహించింది. అలాగే ఈ సినిమా కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఓ సర్​ప్రైజ్ ​ ప్లాన్ కూడా చేసింది.

మూవీలో ఓ సాంగ్​ను అదనంగా యాడ్ చేయబోతున్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని బాలకృష్ణనే స్వయంగా అనౌన్స్​ చేశారు. సక్సెస్​ మీట్​లో బాలయ్య మాట్లాడుతూ.. సినీ ప్రియులకు ఈ గుడ్​ న్యూస్ గురించి​ తెలిపారు. "ఓ సాంగ్​ను రెడీ చేశాము. ఆడియెన్స్​ను అట్రాక్ట్​ చేసేందుకు మాకు అదనంగా జోడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చిత్రం ఇప్పటికే మంచి సక్సెస్ సాధించింది. నాలుగున్నార నిమిషాల నిడివి ఉన్న ఈ సాంగ్​ను 50-60 మంది డ్యాన్సర్లతో తెరకెక్కించాం. ఇప్పుడు దీన్ని యాడ్ చేయబోతున్నాం" అని బాలయ్య అన్నారు.

బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. "భగవంత్ కేసరి లాంటి సోషల్ మెసేజ్ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. దేశం మొత్తం ఈ సినిమా గురించి చర్చించుకుంటోంది. అనిల్ రావిపూడి పాయింట్ చెప్పగానే నాకు ఎంతో నచ్చింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి కొన్ని పాయింట్ల గురించి చర్చించుకుని సినిమాను ముందుకు తీసుకెళ్లాం. వసూళ్లు సాధించేవే కమర్షియల్ సినిమాలు కాదు. సోషల్ మెసేజ్ ఇచ్చేవి కూడా కమర్షియల్ సినిమాలు అవుతాయి" అని అన్నారు.

టాలీవుడ్​ చిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం హీరోయిన్​ శ్రీలీల అని ప్రశంసించారు బాలకృష్ణ. తనకు దొరికిన అద్భుతమైన పాత్రలో చాలా అద్భుతంగా నటించిందని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం దర్శకుడు అనిల్ రావిపూడిదని పేర్కొన్నారు. అందరి నుంచి చక్కని నటనను ఆయన లాక్కున్నారని వెల్లడించారు. ప్రతి మహిళకు ఓ సైనికుడిని ఇవ్వలేమని చెప్పిన బాలయ్య.. మహిళలు ఎవరికి వారే ఓ సైనికుడిలా సిద్ధం అవ్వాలని సూచించారు. ఇంకా ఈ విజయోత్సవ కార్యక్రమంలో​ నిర్మాత దిల్‌ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి సహా తదితరులు చీఫ్​ గెస్టులుగా హాజరై సందడి చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Anil Ravipudi New Movie : 'భగవంత్ కేసరి' బ్లాక్ బాస్టర్​ అయిపోయింది​.. ఇక అనిల్​ నెక్ట్స్​ సినిమా ఎవరితోనంటే?

Bhagvant Kesari Sequel : 'భగవంత్‌ కేసరి' సీక్వెల్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.