Bhagavanth kesari vs Tiger Nageswara Rao : దసరా కానుకగా బరిలోకి మూడు స్టార్ హీరోల సినిమాలు వచ్చాయి. వాటిలో రెండు సినిమాలు ఈ రోజు (అక్టోబర్ 19)న రిలీజ్ అయ్యాయి. ఒకటేమో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' అయితే మరొకటి తమిళ నటుడు దళపతి విజయ్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'లియో'. భారీ అంచనాల నడుమ ఈ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వేర్వేరు రెస్పాన్స్‌లు వస్తోంది. 'భగవంత్ కేసరి'కి పాజిటివ్ టాక్ వస్తుంటే.. 'లియో' మాత్రం మిక్స్డ్ టాక్‌ను అందుకుంటోంది. దీంతో ఫ్యాన్స్ దృష్టంతా ఇప్పుడు మరికొద్ది గంటల్లో విడుదల కానున్న 'టైగర్ నాగేశ్వరరావు'పై పడింది.
వాస్తవానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'భగవంత్ కేసరి' మంచి టాక్ అందుకుంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో విడుదలైన ఈ సినిమాకు అభిమానులు ఎమోషనల్‌గా కనెక్టయ్యారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా.. అందుకు తగ్గట్లే ప్రేక్షకులను అలరించిందని టాక్ నడుస్తోంది. మహిళల సంరక్షణ అనే సోషల్ మెసేజ్‌తో సినిమాను రూపొందించారు. ఇలా కేవలం సందేశాలకే పరిమితం చేయకుండా అభిమానుల్ని, కుటుంబ ప్రేక్షకుల్ని మొప్పించే హీరోయిజంతో పాటు ఎమోషన్స్ జోడించారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
అయితే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'లియో' మాత్రం కొంచెం మిక్స్డ్ టాక్‌తో థియేటర్లలో నడుస్తోంది. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేపోయింది. అయితే విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్ అని అంటున్నారు. .
ఇలా ' లియో' మిక్స్డ్ టాక్,'భగవంత్ కేసరి' మంచి రెస్పాన్స్ కారణంగా రానున్న రోజుల్లో 'టైగర్ నాగేశ్వర రావు'కు 'భగవంత్ కేసరి' మధ్య పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. అయితే 'టైగర్ నాగేశ్వర్రావు' సినిమా రిలీజైతే కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేమంటూ అభిమానులు అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏ విధంగా ఉంటుందో చూడాలి మరీ!
Leo Movie Fans marriage : 'లియో' స్పెషల్.. థియేటర్లో దండలు మార్చుకున్న జంట!
Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : ఈ డైలాగ్స్ విన్నారా ? మీకు ఏది నచ్చింది?