Bhagavanth Kesari OTT : నందమూరి బాలకృష్ణ రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'భగవంత్ కేసరి'. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా.. దసరా విన్నర్‌గా నిలిచింది. టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ సినిమాను ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. నిర్మాతలు సాహు గరపాటి, హరీశ్ సంయుక్తంగా.. షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ 'భగవంత్ కేసరి' డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది. దీంతో ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 24) అమెజాన్‌లో ప్రైమ్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్లో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా భగవంత్ కేసరి రూ. 140 కోట్లు వసూల్ చేసింది.
-
#BhagavanthKesari — Streaming now (Prime) pic.twitter.com/kCSM7qF4Z0
— Movies4u Official (@Movies4u_Officl) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#BhagavanthKesari — Streaming now (Prime) pic.twitter.com/kCSM7qF4Z0
— Movies4u Official (@Movies4u_Officl) November 24, 2023#BhagavanthKesari — Streaming now (Prime) pic.twitter.com/kCSM7qF4Z0
— Movies4u Official (@Movies4u_Officl) November 24, 2023
లియో ఓటీటీ.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి - సూపర్ హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం లియో. భారీ అంచనాల మధ్య గతనెల రిలీజైన ఈ సినిమా.. మిక్స్డ్ టాక్ పొందినప్పటికీ, కలెక్షన్లు సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక సీనియర్ హీరోయిన్ త్రిష.. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా నటించింది. ఈ సినిమా కూడా నవంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓపెన్‌హైమర్.. ప్రముఖ అమెరికన్ ఫిజిస్ట్ రాబర్ట్ కథ ఆధారంగా.. 'ఓపెన్ హైమర్' తెరకెక్కింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అటామిక్ బాంబు తయారు చేయడంలో ఆపెన్ హైమర్ పాత్రను ఇందులో చూపించారు. జూలైలో రిలీజైన ఈ సినిమా.. రీసెంట్గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నవంబర్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ప్రస్తుతానికి రెంట్ విభాగంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా వీక్షించాలంటే రూ.149 చెల్లించాల్సి ఉంది.
త్రిష పై 'లియో' నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు - కోలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం- వివరణ ఇచ్చిన మన్సూర్!
Bhagavanth kesari Collections : ఈ లెక్కలు ఆగేలా లేవుగా.. 9 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?