ETV Bharat / entertainment

Balakrishna Mokshagna : బాలయ్య 2024 మాస్టర్​ 'ప్లాన్'​ రెడీ!.. ఆ మూడు కోరికలు నెరవేరడం పక్కానా? - బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ

Balakrishna Mokshagna : హ్యాట్రిక్​ హిట్లతో మంచి జోష్​ మీద ఉన్న టాలీవుడ్​ స్టార్​ హీరో బాలకృష్ణ వచ్చే ఏడాది కోసం భారీగానే ప్లాన్​​ చేస్తున్నారట. 2024లో బాలయ్యకు ఉన్న మూడు కోరికలు కూడా తీరుతాయని అంటున్నారు ఫ్యాన్స్​. మరి ఆ కోరికలు ఏంటో తెలుసుకుందాం.

Balakrishna 3 wishes : బాలయ్య మూడు కోరికలకు.. వచ్చే ఏడాదే టార్గెట్.. అవేంటో తెలుసా

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 10:08 PM IST

Updated : Oct 25, 2023, 8:05 AM IST

Balakrishna Mokshagna : నందమూరి బాలకృష్ణ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అదే రేంజ్​లో సూపర్​ హిట్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. ఈ క్రమంలో బాలయ్య హ్యాట్రిక్​ హిట్స్​ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాతో గ్యాప్​ ఇవ్వకుండా మరిన్ని ప్రాజెక్ట్స్​తో బిజీ అయిపోనున్నారు బాలయ్య. వచ్చే ఏడాది కోసం పెద్ద ప్లాన్​ను సిద్ధం చేసుకుంటున్నారు.

బాలయ్యకు ఎప్పటి నుంచో మూడు కోరికలు ఉన్నాయట. వాటి కోసం ఆయన చాలా కాలం నుంచి గ్రౌండ్​ వర్క చేస్తున్నారట. అందులో మొట్టమొదటిది 'ఆదిత్య 369'కి సీక్వెల్​ను తెరకెక్కించడం​. ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్​ క్రియేట్​ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అటు బాలయ్యతో పాటు ఇటు మూవీ లవర్స్ కూడా చాలా కాలంగా ఈ స్వీకెల్​ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా 'భగవంత్​ కేసరి' ప్రమోషన్లలో భాగంగా శ్రీలీల చేసిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఈ సీక్వెల్​ గురించి మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్​ను చాలా కాలం క్రితమే ఆయన తెరకెక్కించనున్నట్లు చెప్పారని తెలిపారు. ఇక 'ఆదిత్య 999' కథ సిద్ధంగా ఉందని.. ఒక రోజు రాత్రిలోనే ఈ స్టోరీని రెడీ చేసిన్నట్లు ఆయన అన్నారు.

ఇక తన నటన, మేనరిజంతో ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ.. త్వరలో మెగాఫోన్​ పట్టనున్నారట. 'ఆదిత్య 999' సినిమాను(Aditya 369 Sequel) ఆయనే తెరకెక్కించనున్నారట. అయితే ఈ సినిమా తన దర్శకత్వానికి డెబ్యూ లేదా రెండో సినిమా కావొచ్చు అనే హింట్​ కూడా ఇచ్చారు. దీని బట్టి చూస్తుంటే ఆయన మరో సినిమాను కూడా తెరకెక్కించే ప్లాన్​లో ఉన్నారని తెలుస్తోంది.

మరోవైపు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా వస్తున్న రూమర్స్​పై బాలకృష్ణ స్పందించారు. వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ.. సినిమాల్లోకి రానున్నట్లు బాలకృష్ణ స్పష్టం చేశారు. దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులకు వచ్చే ఏడాది ఇక పండేగే అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు . 'ఆదిత్య 369 సీక్వెల్',​ బాలయ్య దర్శకత్వం, మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇలా తన మనసులోని మూడు కోరికలపై తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బాలయ్య క్లారిటీ ఇవ్వటం వల్ల.. రానున్న ఏడాదిలో అవన్నీ నెరవేరనున్నాయని అభిమానులు అంటున్నారు.

Bhagvant Kesari Movie : గుడ్​ న్యూస్ చెప్పిన బాలయ్య.. ఇక థియేటర్లు మోతే.. ఫ్యాన్స్​ పండగ చేసుకోండి

Bhagvant Kesari Sequel : 'భగవంత్‌ కేసరి' సీక్వెల్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి

Last Updated : Oct 25, 2023, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.