ETV Bharat / entertainment

బాలయ్య బర్త్​డే.. ఫ్యాన్స్​కు స్పెషల్​ ట్రీట్​.. 'నరసింహ నాయుడు' రీరిలీజ్ - balakrishna 108 movie

Narasimha Naidu Rerelease : బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'నరసింహ నాయుడు' రీ రిలీజ్ కానుంది. తెలంగాణ, ఏపీతో పాటు అమెరికాలోని కొన్ని లొకేషన్లలో సినిమా విడుదల కానుంది. దీంతో బాలయ్య అభిమానులు భారీ ఎత్తున హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు.

balakrishna-birthday-special-narasimha-naidu-re-release-in-theatres-on-june-10th

author img

By

Published : Jun 2, 2023, 5:38 PM IST

Narasimha Naidu Rerelease : తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన సూపర్ హిట్ సినిమాల్లో 'నరసింహ నాయుడు' ఒకటి. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.
బాలకృష్ణ బర్త్​డేకు రీరిలీజ్!
Balakrishna Birthday : జూన్ 10న గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ బర్త్​డే. ఆ రోజే 'నరసింహ నాయుడు' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలంగాణ, ఏపీతో పాటు అమెరికాలోని కొన్ని లొకేషన్లలో ఈ సినిమా విడుదల కానుంది. బాలయ్య అభిమానులు భారీ ఎత్తున హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు.

'లక్స్ పాప'... ఇప్పటికీ ఫేమస్సే!
Narasimha Naidu Songs : 'నరసింహ నాయుడు' సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆషా షైనీ హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిన్నికృష్ణ కథ అందించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో ఫ్యాక్షన్ సీన్లకు థియేటర్లలో ఈలలే ఈలలు. ముఖ్యంగా బాలకృష్ణ ఉగ్ర నరసింహుడిగా మారి చేసిన యాక్షన్ సీన్లు ప్రేక్షకులు అందరినీ అలరించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలోని పాటల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 'లక్స్ పాప' సాంగ్ ఇప్పటికీ ఫేమస్సే! ఎక్కడో ఒక చోట వినపడుతూ ఉంటుంది. 'కో కో కోమలి..', 'నిన్న కుట్టేసినాది..', 'చిలకపచ్చ కోక..' పాటలు కూడా హిట్టే. ఈ సినిమా మ్యూజిక్ అప్పట్లో సెన్సేషన్. మరోసారి థియేటర్లలో పాటలకు, ఫైట్లను ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

బాలకృష్ణ బర్త్ డేకు NBK 108 టైటిల్ కూడా!
NBK 108 Title : అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా NBK 108 రూపొందుతోంది. హీరోగా ఆయనకు ఇది 108వ సినిమా. ఈ చిత్రంలో బాలయ్య భగవత్ కేసరి పాత్రలో కనిపిస్తారట. అందుకే సినిమాకు కూడా ఆ టైటిలే కన్ఫర్మ్ చేశారని తెలిసింది. అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నారు మేకర్స్​.

ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా హీరోయిన్​ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వాళ్లద్దరి కలయికలో తొలి సినిమా ఇది. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీలీల ఉన్నారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరాకు ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

'హిట్- 4'లో బాలయ్య?.. జూన్ 10 కోసం డైరెక్టర్​ శైలేశ్​ వెయిటింగ్!
మరోవైపు, బాలయ్య కొత్త సినిమాకు సంబంధించి మరో ప్రకటన కూడా ఆయన పుట్టినరోజు నాడు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శైలేశ్​ కొలను తెరకెక్కిస్తున్న హిట్​ ఫ్రాంఛైజ్​లో భాగంగా బాలయ్య ఓ మూవీ చేయబోతున్నారట. అందుకు సంబంధించిన పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.