ETV Bharat / entertainment

బాలయ్య ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​.. సినిమా రిలీజ్ పోస్ట్​పోన్!​.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే? - బాలకృష్ణ భైరవద్వీపం రీరిలీజ్ వాయిదా

నందమూరి బాలయ్య అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. రిలీజ్​ కానున్న బాల్యయ సినిమా పోస్ట్ పోన్​ అయినట్లు తెలిసింది. దీంతో ఫ్యాన్స్​ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Balakrishna Bhairava Dweepam Postpone
బాలయ్య ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​.. సినిమా రిలీజ్ పోస్ట్​పోన్!​.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 11:29 AM IST

Balakrishna Bhairava Dweepam Postpone : నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆయన గతంలో నటించిన క్లాసిట్​ హిట్ జానపద చిత్రం 'భైరవద్వీం' నేడు(ఆగస్ట్​ 30) విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమా రిలీజ్​ అవ్వట్లేదని తెలిసింది. దీంతో ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాలయ్య ఫ్యాన్స్​కు నిరాశ ఎదురైంది!

ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. సీనియన్ నటి రోజా హీరోయిన్​గా నటించింది. మాధవ పెద్ది సురేష్‌ స్వరాలు సమకూర్చారు. 1994లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అలానే 9 నంది పురస్కారాల్ని అందుకుంది. అయితే ఇప్పుడు తెలుగు చిత్రసీమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బాలయ్య సినిమాలను రీరిలీజ్​లు చేస్తున్నారు. ఇప్పటికే 'చెన్న కేశవరెడ్డి', 'నరసింహనాయుడు' రిలీజై బాలయ్య అభిమానులను అలరించాయి. ఇక ఇప్పుడు భైరవద్వీపం వంతు వచ్చింది.

Balakrishna Bhagwant Kesari : ఈ చిత్రానికి ఆధునిక హంగులు అద్ది 4కె రిజుల్యూషన్‌తో విడుదల చేయ్యాలని సిద్ధమయ్యారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ క్లాప్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్​ కూడా ఓ పోస్టర్​ను వదిలింది. దీంతో ఈ క్లాసిక్ హిట్ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్​ బాగా వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు టెక్నికల్ సమస్యల​ వల్ల ఈ రీరిలీజ్​ను ఆపినట్లు తెలిసింది. రీషెడ్యూల్​ చేసి నవంబర్ నెలకు పోస్ట్​పోన్ చేసినట్లు సమాచారం అందింది. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం ఫన్ డైరెక్టర్​ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్‌ కేసరి' అనే మాస్‌ యాక్షన్‌ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ బిజినెస్​ కూడా బాగా జరిగినట్లు తెలిసింది. బాలయ్య సరసన హీరోయిన్​గా కాజల్ అగర్వాల్ నటించగా.. ఇతర కీలక పాత్రల్లో యంగ్ బ్యూటీ శ్రీలీల శరత్​ కుమార్​ నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లైనప్​తో బాలయ్య ఫుల్​ బిజీ.. ఆ సీనియర్​ డైరెక్టర్​కు ఛాన్స్​ దొరుకుతుందా?

Skanda Pre Release Event : అతడు నాకే సవాల్​ విసిరాడు.. తప్పకుండా సక్సెస్​ అవుతా!.. బాలయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.