ETV Bharat / entertainment

Baby Movie Remake : బేబీ సినిమాకు మాసివ్​ రెస్పాన్స్​.. త్వరలో ఆ రెండు భాషల్లోనూ.. - బేబీ సినిమా రీమేక్

Baby Movie Remake : టాలీవుడ్ యంగ్​ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'బేబీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్​తో పాటు బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అ ఓటీటీలో కూడా ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్​ సాధించి రికార్డు కొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల అనంతరం.. దర్శకుడు సాయి రాజేశ్ రీమేక్ ప్లాన్స్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..

Baby Movie Remake
Baby Movie Remake
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 4:17 PM IST

Baby Movie Remake : అంచనాలు లేకుండా వచ్చి.. సెన్సేషన్ క్రియేట్ చేసిన కల్ట్ క్లాసిక్ మూవీ 'బేబీ'. దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతనెల థియేటర్లలో రిలీజై.. మంచి విజయం సాధించిన ఈ సినిమా.. రీసెంట్​గా ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ 'ఆహా'లో కూడా విడుదలైంది. అయితే ఓటీటీ విడుదల అనంతరం డైరెక్టర్ సాయి రాజేశ్.. తాజాగా జరిగిన ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్​ సెషన్​లో పాల్గొన్నారు. ఈ సెషన్​లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న ఆయన.. మూవీ రీమేక్​ గురించి ఓ అప్​డేట్ ఇచ్చారు. అదేంటంటే..

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'బేబీ' సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు సాయి రాజేశ్ తెలిపారు. " తెలుగులో తీసిన విధంగా బాలీవుడ్​లో వర్కౌట్ కాకపోవచ్చు. నార్త్ ఆడియెన్స్​ అభిరుచికి అనుగుణంగా కథలో మార్పులు చేయాల్సి ఉంటుదని మేము భావిస్తున్నాం" అని రాజేశ్ అన్నారు. ఇక యువతకు సంబంధించిన స్టోరీ కాబట్టి ఈ సినిమా అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని మూవీ మేకర్స్ నమ్ముతున్నారు.

Baby Movie Story Telugu : వైషు అలియాస్ వైష్ణ‌వి (వైష్ణ‌వి చైత‌న్య‌) ఓ బ‌స్తీకి చెందిన అమ్మాయి. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమ‌ను ఆనంద్​ కూడా అంగీక‌రిస్తాడు. వీరి ప్రేమ పాఠశాల రోజుల్లోనే ముదురుతుంది. అయితే ప‌దో త‌ర‌గ‌తి ఫెయిల్​ కావడం వల్ల ఆనంద్ ఆటో డ్రైవ‌ర్‌గా స్థిర‌ప‌డ‌తాడు.

వైష్ణవి మాత్రం ఇంట‌ర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్క‌డ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల.. వైషూ ఆలోచ‌నా విధానంలో మార్పులు మొద‌లై.. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న క్లాస్‌మేట్‌ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. ఈ క్ర‌మంలోనే అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల విరాజ్‌కు వైష్ణ‌వి శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల్సి వ‌స్తుంది. అయితే ఆ త‌ర్వాత ఏమైంది? వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఆనంద్‌కు తెలిసిందా? నిజం తెలిశాక ఆనంద్​ ఎలా స్పందించాడు? అన్న‌ విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Baby OTT Release : OTTలోకి కల్ట్ బ్లాక్ బస్టర్.. వామ్మో.. ఒక్కరోజులోనే ఈ రేంజ్​ రెస్పాన్సా?

Vaishnavi Chaitanya Marriage : 'ఆనంద్‌- విరాజ్​లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్?'​.. వైష్ణవి ఆన్సర్‌ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.