ETV Bharat / entertainment

Baby Movie OTT : 4గంటల రన్​టైమ్​తో ఓటీటీలోకి 'బేబీ'.. ఆ సీన్స్ అన్నీ యాడ్! - బేబీ సినిమా ఓటీటీ రిలీజ్

Baby Movie OTT : రీసెంట్​ బ్లాక్​బస్టర్ 'బేబీ' సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. సుమారు 3 గంటల రన్​టైమ్​తో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో 4 గంటల నిడివితో రానున్నట్లు తెలుస్తోంది.

Baby Movie OTT
బేబీ సినిమా ఓటీటీ
author img

By

Published : Aug 4, 2023, 9:11 AM IST

Baby Movie OTT : అంచనాలు లేకుండా వచ్చి బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది 'బేబీ' మూవీ. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమాపై మరో బజ్ క్రియేట్ అయ్యింది. సుమారు 3 గంటల నిడివి కలిగిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం 4 గంటల రన్​టైమ్​తో రానుందట. అయితే తాజాగా మరో పాట సహా.. కొన్ని సన్నివేశాలను సినిమాలో చేర్చనున్నారని సమాచారం.

కాగా ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య, నటుడు విరాజ్​ మధ్య ఎక్కువ సీన్స్​ ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండకు సంబంధించి కొన్ని ఎమోషనల్​ సన్నివేశాలు కూడా ఉంటాయట. అయితే ఇవన్నీ సాధ్యమైతే ఓటీటీలోకి 'బేబీ' నాలుగు గంటల రన్​టైమ్​తో సందడి చేయనుంది.

ఇక కల్ట్ లవ్ స్టోరీగా జులై 14న థియేటర్లలో రిలీజైన 'బేబీ'.. యూత్​ను బాగా ఆకట్టుకుంది. ట్రయాంగిల్ లవ్​స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో ఆనంద్​ దేవరకొండ-వైష్ణవి, చైతన్య- విరాజ్ అశ్విన్‌ తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర అందరికి బాగా కనెక్ట్ అయింది.

చిన్న సినిమాగా విడుదలయ్యి.. ఎందరో ప్రముఖ నటుల నుంచి ప్రసంశలు అందుకుంది 'బేబీ' సినిమా. థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతూ.. ఇప్పటికే సుమారు రూ. 80 కోట్ల గ్రాస్ అందుకుంది. కాగా మూవీమేకర్స్.. రీసెంట్​గా ఈ సినిమా సక్సెస్​మీట్​ను హైదరాబాద్​లో గ్రాండ్​గా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'హృదయ కాలేయం', 'కొబ్బరి మట్ట' ఫేమ్​ సాయి రాజేష్ నీలం ఈసినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీనివాస కుమార్ నాయుడు(ఎస్కేఎన్​) నిర్మాతగా వ్యవహరించారు.

తొలి సినిమాతోనే సక్సెస్.. హీరోయిన్​గా తెలుగమ్మాయి తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నెగిటీవ్ పాత్రలో కనిపించి ఆడియెన్స్​ను మెప్పించింది వైష్ణవి. ఇక ఈ సినిమా సక్సెస్​తో మరిన్ని సినిమాల్లో ఛాన్స్​లు కొట్టేసిందట ఈ అమ్మడు. తొసి సినిమా ప్రొడ్యూసరే మరో మూడు చిత్రాల్లో నటించే ఆఫర్ ఇచ్చారట. గీతా ఆర్ట్స్ బ్యానర్​లో కూడా మరో సినిమా చేయనుందని టాక్ వినిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.