ETV Bharat / entertainment

'అవతార్-2' వసూళ్ల సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.3,500 కోట్లకుపైగా..! - avatar2 updatest

Avatar 2 First Weekend Collections: 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' సినిమా మొదటి వారాంతంలో దాదాపు రూ.3500 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా రోజుకు రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తోందన్న మాట!.

avatar2-world-wide-collections
avatar2-world-wide-collections
author img

By

Published : Dec 19, 2022, 5:16 PM IST

Avatar 2 Weekend Collections: 'అవతార్' సినిమా బడ్జెట్, వచ్చిన కలెక్షన్లు విని ఒకప్పుడు అంతా నోరెళ్లబెట్టారు. దాదాపు రెండు వేల కోట్లతో తెరకెక్కిస్తే పది రెట్ల లాభానికి పైగా వచ్చినట్టుంది. 'అవతార్' సినిమా దాదాపు రూ.29 వేల కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఆ రికార్డులను 'అవతార్ ది వే ఆఫ్‌ వాటర్' అవలీలగా క్రాస్ చేసేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3500 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.

భారత్‌లోనూ ఈ చిత్రం దుమ్ములేపేస్తోంది. మొదటి వారాంతంలోనే ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రూ.129 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కువగా ఇంగ్లీష్‌ భాషలోనే అవతార్‌ను సినీ ప్రేక్షకులు చూసినట్టు తెలుస్తోంది.
మొత్తానికి అవతార్ ప్రతీ దేశంలో మార్మోగిపోతోందని అర్థమవుతోంది. ఈ సినిమాకు జేమ్స్ కామరూన్ పెట్టింది 250 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రెండు వేల కోట్ల రూపాయిలు. ఆ మొత్తం రెండు రోజుల్లోనే వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.