ETV Bharat / entertainment

నార్త్​లో రాణిస్తున్న యంగ్ డైరెక్టర్లు - అట్లీ, సందీప్​లో ఆ సౌత్‌ రికార్డ్‌ ఎవరికి సొంతమవ్వనుందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 11:56 AM IST

Updated : Nov 30, 2023, 12:08 PM IST

Atlee Vs Sandeep : ట్రెండ్​కు తగ్గట్లు నడుస్తూ బాక్సాఫీస్​ను షేక్​ చేస్తున్నారు ఇప్పటి యంగ్ డైరక్టర్స్​. తమ ట్యాలెంట్​తో అటు నార్త్​తో పాటు ఇటు సౌత్​లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 'జవాన్' సినిమా​తో బాలీవుడ్​లో మంచి గుర్తింపు పొందిన అట్లీకి సౌత్​ నుంచి సందీప్​ రెడ్డి పోటిగా వచ్చారు. 'యానిమల్'​ సినిమాతో రికార్డులు బ్రేక్​ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇంతకీ అదేంటంటే ?

atlee vs sandeep
atlee vs sandeep

Atlee Vs Sandeep : పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో డైరెక్టర్లు కూడా తమ సినిమాలను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్లాన్​ చేస్తున్నారు. అందులో భాగంగా తమ చిత్రాల కోసం ఇతర భాష నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇతర భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్నారు. సౌత్​ , నార్త్​ అన్న భేదాలు లేకుండా తమ ట్యాలెంట్​తో అక్కడ కూడా దూసుకెళ్తున్నారు. ఇటీవలే తమిళ డైరెక్టర్​ అట్లీ తెరకెక్కించిన జవాన్​ సినిమా అందుకు నిదర్శనం. పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిన ఆ చిత్రం హిందీతో పాటు అన్ని భాషల్లో విశేషాదరణ అందుకుని బాక్సాఫీస్​ వద్ద భారీ స్థాయిలో కలెక్షలను సాధించింది. దీంతో అట్లీ పేరు నార్త్​లో మారుమోగిపోయింది. అప్పటివరకతుు సౌత్​కు పరిమితమైన ఈ స్టార్ డైరెక్టర్​.. ఒక్క సారిగా పాన్ ఇండియా లెవెల్​లో పాపులరైపోయారు.

అయితే 'జవాన్‌'కి ముందే మన సౌత్​ నుంచి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా 'కబీర్ సింగ్' సినిమాతో కమర్షియల్‌ బ్లాక్​ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 'అర్జున్​ రెడ్డి'కి రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కగా.. అప్పటి వరకు ఉన్న సందీప్​ స్టార్​డమ్​ను అమాంతం పెంచేసింది. అంతే కాకుండా షాహిద్​ కపూర్​కు సాలిడ్​ హిట్​ పడటం వల్ల అందరి దృష్టి ఈ యంగ్​ డైరెక్టర్​పై పడింది. ఇక ఇదే జోరుతో సందీప్ ఇప్పుడు యానిమల్​ సినిమాతో బాలీవుడ్​లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​, సాంగ్స్​తో ఈ సినిమాకు మంచి హైప్​ ఉంది.

ఇక 'జవాన్' సినిమా సౌత్ ఇండియాలో దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లను నమోదు చేసి రికార్డుకెక్కింది. అయితే ట్రేడ్​ వర్గాల అంచనాల ప్రకారం 'యానిమల్‌' మూవీకి అన్ని భాషల్లో కలిపి కచ్చితంగా రూ.200 కోట్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ ఇది నిజమైతే సౌత్​లో అత్యధిక వసూళ్లు నమోదు చేయనున్న హిందీ సినిమాగా 'యానిమల్' రికార్డుకెక్కనుంది. చూడాలి ఈ సారి బాక్సాఫీస్​ విజేతగా ఎవరు నిలవనున్నారో ?

Sharukh Khan Jawan Movie Collections : రొటీన్ కమర్షియల్​తోనే రూ.1000 కోట్లు.. ఇక షారుక్​ నెక్స్ట్​ టార్గెట్​ అదే!

'యానిమల్' రన్​టైమ్ 3.20 గంటలు! - బాలీవుడ్​లో ఇదే లాంగెస్ట్ మూవీ బాస్!

Last Updated : Nov 30, 2023, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.