ETV Bharat / entertainment

అదిరిన 'అర్జున కల్యాణం' ట్రైలర్​.. రామ్​- శింబు 'స్నీక్​ పీక్​' రిలీజ్ - Ashokavanamlo Arjuna Kalyanam

టాలీవుడ్‌ యంగ్‌ అండ్​ మాస్​ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను బుధవారం చిత్రబృందం విడుదల​ చేసింది. మరోవైపు.. రామ్​ పోతినేని 'ది వారియర్' సినిమాలో హీరో శింబు పాడిన బుల్లెట్​ పాట మేకింగ్​ వీడియోను 'స్నీక్​ పీక్​' పేరుతో మేకర్స్​ రిలీజ్ చేశారు. వాటిని చూసేయండి.

ashokavanamlo-arjuna-kalyanam-trailer-ram-the-warrior-sneak-peek-release

author img

By

Published : Apr 20, 2022, 6:05 PM IST

Ashokavanamlo Arjuna Kalyanam Trailer: 'నాకిప్పుడు 33 ఏళ్లు. ఇంకో మూడు సంవత్సరాలకు 36 వస్తాయి. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా? అది నేరమా?' అని ప్రశ్నిస్తున్నాడు నటుడు విశ్వక్‌ సేన్‌. నిజజీవితంలో కాదండోయ్‌! ఆయన నటించిన'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలోని సంభాషణ ఇది. దర్శకుడు విద్యాసాగర్‌ చింతా రూపొందించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. కామెడీ+ ఎమోషన్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంది. సన్నివేశాలకు తగ్గట్టు వినిపించే 'రాసేసుంటుంది మొత్తం.. పెళ్లి స్క్రిప్టు' అనే వాయిస్‌ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రంలో తెలంగాణ అబ్బాయి అర్జున్‌కుమార్‌గా విశ్వక్‌ సేన్‌, ఆంధ్రా అమ్మాయి మాధవిగా రుక్సర్‌ థిల్లాన్‌ కనిపించనున్నారు. అంత వయసొచ్చినా అర్జున్‌కు పెళ్లి ఎందుకు కాలేదు? ఎట్టకేలకు సంబంధం ఖాయం అయినా అర్జున్‌ను పెళ్లాడటానికి మాధవి ఎందుకు నో చెప్పింది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎస్వీసీసీ డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జై క్రిష్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది.

Ram The Warrior Sneak Peek Release: కోలీవుడ్​ స్టార్ శింబు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. అప్పుడప్పుడు సింగర్​గా గొంతును సవరించుకుంటుంటారు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడిన ఆయన.. తాజాగా హీరో రామ్​పోతినేని 'ది వారియర్'​ కోసం మరోసారి సింగర్​గా​ అవతారం ఎత్తారు. 'ది వారియర్' చిత్రంలో బుల్లెట్​ పాటను ఆయన ఆలపించారు. అందుకు సంబంధించిన మేకింగ్​ వీడియోను 'స్నీక్​ పీక్'​ పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. బుల్లెట్ పూర్తి లిరికల్​ సాంగ్​ను​ ఏప్రిల్​ 22వ తేదీన సాయంత్రం 5.45 నిమిషాలకు రిలీజ్​ చేయబోతున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి: 'హరిహర వీరమల్లు' క్రేజీ బజ్​.. ఓటీటీలోకి 'గంగూబాయి'

'బీస్ట్‌' డైరెక్టర్‌పై విజయ్‌ తండ్రి ఫైర్​​.. వారికి 'కశ్మీర్‌ ఫైల్స్‌' దర్శకుడి​​ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.