Vishwak Sen: 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నామా దాస్', 'పాగల్' చిత్రాలతో మాస్ కా దాస్‌గా పేరు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. కూల్, క్లాస్ లుక్‌లో ఆయన నటించిన కుటుంబ కథా చిత్రం 'అశోకవనంలో అర్జునకళ్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకుడు. పెళ్లి కోసం ఎదురుచూసే ఓ 30 ఏళ్ల వ్యక్తి ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో ఎంతో సరదాగా చూపించారు. వేసవి కానుకగా మే 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీలతో విశ్వక్ సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం ఉదయం విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ప్రతి సినిమాలో మీకొక బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు చూపించారు. రియల్ లైఫ్‌లో ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందా? అని ఓ యువతి ప్రశ్నించగా.. "ప్రతి ఒక్క మగాడి లైఫ్‌లో ఏదో ఒక సమయంలో ఇలాంటి కథలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ ట్రాజెడీకి గురవుతారు. అదే విషయాన్ని మేము సినిమాల్లో చూపిస్తున్నాం. ఇక రియల్‌లైఫ్ విషయానికి వస్తే.. నాకొక బ్రేకప్ స్టోరీ ఉంది. సుమారు మూడేళ్లు పాటు ఓ అమ్మాయిని ప్రేమించాను. ఎందుకో తెలియదు.. ఆమె నన్ను వదిలేసింది. ఆ విషయం కూడా నెల రోజుల తర్వాతనే నాకు తెలిసింది. ఇంతకు మించి ఆమె గురించి ఏమీ చెప్పలేను. ఇప్పటికీ బాధగానే ఉంటుంది" అని విశ్వక్ వివరించారు. అనంతరం తనకు కాబోయే భార్యకు తనకంటే ఎక్కువ తెలివి ఉండాలనుకుంటున్నట్లు విశ్వక్ తెలిపారు.
ఇక సినిమాల పరంగా మంచి జోరుమీదున్నాడు విశ్వక్. 'దాస్ కా ధమ్కీ', 'ఓరి దేవుడా', 'ముఖచిత్రం', 'గామి' చిత్రాల్లో నటిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: విశ్వక్ సేన్ పెళ్లి కష్టాలు.. 'ఓరి దేవుడా..!'