ETV Bharat / entertainment

ఓటీటీలో అనుపమ 'బటర్​ప్లై' రిలీజ్!​.. కమల్​ 'ఇండియన్​ 2' నుంచి కాజల్​ ఔట్​? - కాజల్​ అగర్వాల్​ సినిమాలు

కెరీర్​లో తొలిసారి నేరుగా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించేందుకు హీరోయిన్​ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సిద్ధ‌మయ్యారు. ఆమె హీరోయిన్​గా న‌టించిన 'బ‌ట‌ర్‌ఫ్లై' చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు సమాచారం. మరోవైపు, ప్రెగ్నెన్సీ కార‌ణంగా నాగార్జున 'ది ఘోస్ట్' సినిమా మ‌ధ్య‌లో ఉండ‌గానే వైదొలిగిన కాజ‌ల్​ను మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా 'ఇండియన్​ 2' నుంచి త‌ప్పించనున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

anupama ott entry and kajal out from indian 2 movie

author img

By

Published : Jul 7, 2022, 12:34 PM IST

Anupama Parameswaran ButterFly Movie OTT: 'అఆ' సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్​లో కనిపించి న‌టిగా వైవిధ్య‌త‌ను చాటుకున్న అనుప‌మ.. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో 'ప్రేమమ్'​లో న‌టించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. కెరీర్​లో తొలిసారి మ‌హిళా ప్ర‌ధాన క‌థాంశంతో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నటించిన చిత్రం 'బ‌ట‌ర్ ఫ్లై'. హర్రర్​ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

anupama
అనుపమ 'బటర్​ఫ్లై' ఫస్ట్​లుక్​

ఓ అపార్ట్​మెంట్​లో యువ‌తికి ఎదుర‌య్యే అనూహ్య ప‌రిణామాల‌తో 'బ‌ట‌ర్‌ఫ్లై' సినిమాను రూపొందించారు. షూటింగ్​ ఎప్పుడో పూర్తి కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ డేట్‌పై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. డిస్నీ హాట్​స్టార్​ ఓటీటీ సంస్థ‌తో నిర్మాత‌లు ఇటీవ‌లే ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే 'బటర్ ఫ్లై' రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం.

కమల్​ 'ఇండియన్​ 2' నుంచి కాజల్​ ఔట్​?.. 'విక్రమ్' సినిమా అద్భుతం విజయం​తో ఫుల్ జోష్​లో ఉన్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్. ఈ ఉత్సాహంతోనే 'ఇండియన్ 2' సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాత‌ల‌కు మ‌ధ్య నెలకొన్న విభేదాల కార‌ణంగా 'ఇండియన్ 2' షూటింగ్ ఏడాది క్రితం నిలిచిపోయింది. ఆగ‌స్టు నెలలో షూటింగ్​ను తిరిగి ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

anupama ott entry and kajal out from indian 2 movie
ఇండియన్​ 2 సినిమా కమల్​ పోస్టర్

క‌మ‌ల్‌హాస‌న్​ను మ‌రోసారి సేనాప‌తి పాత్ర‌లో చూపిస్తూ ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్స్‌ను గతేడాది చిత్ర యూనిట్ విడుద‌ల‌ చేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్​ను హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రకటించారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై ప‌లు కీల‌క‌మైన సన్నివేశాలను చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో సెట్స్​లో క్రేన్ కూలిపోవ‌డం వల్ల ముగ్గురు చిత్ర యూనిట్ స‌భ్యులు మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదం నుంచి త్రుటిలో క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో చిత్రీకరణ నిలిచిపోయింది.

కాజల్​ అగర్వాల్​

ఈ చిత్ర షూటింగ్​ను పునః ప్రారంభించేందుకు కొంత‌కాలంగా క‌మ‌ల్ గట్టిగా ప్రయత్నాలు చేశారు. అందుకు దర్శకుడు శంక‌ర్ కూడా అంగీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆగ‌స్టు నెల‌లో షూటింగ్​ను తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. కాగా పాత్రలు, బడ్జెట్ పరంగా సినిమాలో చాలా మార్పులు చేయబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే హీరోయిన్​ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ సినిమా నుంచి త‌ప్పించే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో మ‌రో హీరోయిన్​ను తీసుకోబోతున్న‌ట్లు స‌మాచారం.

ఇవీ చదవండి: అక్కడ పవర్ స్టార్ టాటూ.. 'నా బాడీ నా ఇష్టం' అంటూ బిగ్​బాస్​ బ్యూటీ పోస్ట్

అందుకే 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా: నటుడు వేణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.