ETV Bharat / entertainment

కడుపుబ్బా నవ్విస్తున్న 'అంటే సుందరానికీ' ట్రైలర్​.. 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్​ ఎప్పుడంటే? - విరాటపర్వం

టాలీవుడ్​ సినిమాల కొత్త కబుర్లు వచ్చేశాయి. కామెడీ ఎంటర్టెయినర్​గా తెరకెక్కిన 'అంటే సుందరానికీ' సినిమా ట్రైలర్​ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందుతున్న 'ఎఫ్​3' ఓటీటీ రిలీజ్​ గురించి కూడా చిత్రబృందం అప్​డేట్​ ఇచ్చింది. ఇంకా మరికొన్ని అప్​డేట్స్ ఏమున్నాయంటే..

d
d
author img

By

Published : Jun 2, 2022, 8:13 PM IST

చాలాకాలం తర్వాత నాని నటించిన కామెడీ ప్రధాన చిత్రం 'అంటే.. సుందరానికీ!'. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్‌ జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విశాఖపట్నం వేదికగా గురువారం విడుదల చేసింది. ఈ సినిమాలో ఎంత వినోదం ఉంటుందో ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడీ ట్రైలర్‌ అంతకుమించిన వినోదం పంచేలా ఉంది. ఈ ప్రచార చిత్రంలో చూపించిన ప్రతి క్యారెక్టర్‌ నవ్వుల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా కథానాయకుడి హావభావాలు చక్కిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సుందర్‌గా నాని కనిపించనున్నారు. మలయాళ నటి నజ్రియా లీల అనే పాత్ర పోషించింది. నరేశ్‌, రోహిణి, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'విరాటపర్వం'. ఎస్ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'విరాటపర్వం' ప్రచారాన్ని మొదలుపెట్టిన చిత్ర బృందం..తాజాగా నగదారిలో పాటను విడుదల చేసింది. సురేష్ బొబ్బిలి సంగీతంలో నరేందర్ రెడ్డి, భరద్వాజ ఈ పాటను రచించగా... వరం ఆలపించారు. చిత్ర కథకు అద్దంపట్టేలా నిప్పు ఉంది నీరు ఉందంటూ సాగే నగదారి పాటలో సాయిపల్లవి రానాతో కలిసి చేసే ప్రయాణాన్ని వివరించారు.

'ఎఫ్​3' ఓటీటీలోకి ఎప్పుడంటే.. విక్టరీ వెంకటేష్​, మెగా హీరో వరుణ్​ తేజ్​ కథానాయకులుగా అనిల్​ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్​3'. 'ఎఫ్​2'కు సీక్వెల్​గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ఈ నేపథ్యంలో 'ఎఫ్​3' ఓటీటీ రిలీజ్​పై గతకొన్ని రోజులుగా సినీప్రియులు చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన చిత్రబృందం.. ఇప్పట్లో ఓటీటీ రిలీజ్​ లేదని క్లారిటీ ఇచ్చింది. థియేటర్లలో 8 వారాలు పూర్తయ్యేవరకు ఓటీటీలో 'ఎఫ్​3' విడుదల కాదని పేర్కొంది.

ఇదీ చూడండి: 'కేకే'కు కన్నీటి వీడ్కోలు.. కడసారి చూసేందుకు తరలివచ్చిన తారాగణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.