ETV Bharat / entertainment

'యానిమల్' ఓటీటీ రిలీజ్ - కోర్టుకెక్కిన సహ నిర్మాత - యానిమల్ కో ప్రొడ్యూసర్ కోర్టు కేసు

Animal OTT Release : మరికొద్ది రోజుల్లో యానిమల్​ సినిమా ఓటీటీలో వస్తుందనుకున్న తరుణంలో మేకర్స్​కు షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా స్టే విధించాంటూ యానిమల్ కో ప్రొడ్యోసర్ కంపెనీ సినీ వన్ స్టూడియోస్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Animal OTT  Release
Animal OTT Release
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 7:02 AM IST

Animal OTT Release : బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ - డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషన్​లో తెరకెక్కిన 'యానిమల్​ మూవీ' మంచి సక్సెస్​ అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతోంది. అయితే ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించించిన సినీ1 స్టూడియోస్ ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ చేయకుండా స్టే విధించాలంటూ దిల్లీ హై కోర్టును ఆశ్రయించింది.

ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసింగ్​ సంస్థ టి-సిరీస్ తో కుదుర్చుకున్న తమ ఒప్పందం ఉల్లంఘనకు గురైందని, అంతే కాకుండా యానిమల్‌లో 35% ప్రాఫిట్ షేర్, మేథో సంపత్తి హక్కులు ఉన్నాయంటూ సినీ1 స్టూడియోస్ పిటీషన్​ దాఖలు చేసింది. ఈ సినిమాను నిర్మించడం, ప్రమోట్ చేయడం, విడుదల చేసే విషయంలో టి-సిరీస్ తమ అనుమతిని తీసుకోలేదంటూ సినీ1 ఆ పిటీషన్​లో పేర్కొంది.

మరోవైపు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ టి-సిరీస్ తమ ప్రాఫిట్ షేరింగ్ ఒప్పందాన్ని గౌరవించలేదని, ఆర్థిక నష్టపరిహారం అందించడంలోనూ విఫలమైందంటూ సినీ1 ఆరోపించింది.అంతే కాకుండా 'యానిమల్'​కు సీక్వెల్​గా తెరకెక్కనున్న 'యానిమల్​ పార్క్' మూవీని టి-సిరీస్ ప్రకటించడాన్ని వ్యతిరేకించింది. ఈ ప్రాజెక్టు విషయంలో తమకు హక్కులు వర్తిస్తాయని, తమతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం కచ్చితంగా ఉందంటూ కోర్టుకు వివరణ ఇచ్చింది.

అయితే సోమవారం జరిగిన విచారణలో టి-సిరీస్ న్యాయవాది అమిత్ సిబల్ ఈ సినిమా హక్కులను సినీ 1 సంస్థ రూ. 2.2 కోట్లకు వదులుకున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్​ను కోర్టుకు సమర్పించారు. దీన్ని ఆ సంస్థ దాచిపెట్టిందంటూ వాదించారు. ఈ విషయంలో సినీ 1 సంస్థ ఎటువంటి చట్టపరమైన పరిష్కారానికి అర్హులు కాదంటూ టి- సిరీస్ న్యాయవాది కోర్టులో చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై దీనిపై స్పందించిన కోర్టు డాక్యుమెంట్ స్వభావాన్ని స్పష్టం చేయాలంటూ సినీ1 తరఫు న్యాయవాది సందీప్ సేథీకి సూచించింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను కూడా'- సినీ క్రిటిక్స్​పై సందీప్ ఫైర్!

ఒక్క దెబ్బతో అన్నయ్య లైఫ్​ సెట్​ చేసిన సందీప్- అప్పుడు 32ఎకరాలు అమ్మేసినా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.