Animal Movie Day 2 Collections : భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తోంది 'యానిమల్' మూవీ . సందీప్ రెడ్డి వంగా మార్క్‌తో తెరకెక్కిన ఈ సినిమా అటు విడుదలైన అన్ని థియేటర్లలో మంచి టాక్ అందుకుని దూసుకెళ్తోంది. తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో రోజు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 236 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని 'యానిమల్' మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
-
Rewriting the Script of Success 🔥🪓#AnimalHuntBegins
— Animal The Film (@AnimalTheFilm) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/ESD2y03Crt
">Rewriting the Script of Success 🔥🪓#AnimalHuntBegins
— Animal The Film (@AnimalTheFilm) December 3, 2023
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/ESD2y03CrtRewriting the Script of Success 🔥🪓#AnimalHuntBegins
— Animal The Film (@AnimalTheFilm) December 3, 2023
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/ESD2y03Crt
మరోవైపు ఈ సినిమా గురించి నెట్టింట హిట్ టాక్ వినిపిస్తున్నప్పటికీ అక్కడక్కడ నెగిటివిటీ కూడా చెలరేగుతోంది. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమాలో రణ్‌బీర్ నటనకు ఫిదా అవుతున్నారు. డిఫరెంట్ షేడ్స్‌లో నట విశ్వరూపాన్ని చూపించారంటూ ఈ బాలీవుడ్ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన క్యారెక్టర్‌కు 100 పర్సెంట్ న్యాయం చేశారంటూ రణ్‌బీర్‌ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇక రష్మిక, అనిల్ కపూర్, బాబీ దేఓల్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
Animal Movie Sequel Update : మరోవైపు ఈ సినిమా అటు సెంటిమెంట్‌తో పాటు వయోలెన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. పైగా పోస్ట్ క్రెడిట్ సీన్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉండనుందని డైరెక్టర్ రివీల్ చేశారు. దీంతో రానున్న 'యానిమల్ పార్క్'పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ఇదే టాక్ కొనసాగితే యానిమల్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Animal Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ దేఓల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను పెంచారు. మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అక్కడక్కడ నెగిటివ్ టాక్ అందుకున్నప్పటికీ.. అవేవి నిజం కావంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.
'యానిమల్' తొలి రోజు కలెక్షన్స్ రూ.116 కోట్లు - సందీప్ రెడ్డి మాస్ పల్స్ పట్టేశాడుగా!