ETV Bharat / entertainment

Anil Ravipudi New Movie : 'భగవంత్ కేసరి' బ్లాక్ బాస్టర్​ అయిపోయింది​.. ఇక అనిల్​ నెక్ట్స్​ సినిమా ఎవరితోనంటే? - అనిల్ రావిపూడి లేటెస్ట్ న్యూస్​

Anil Ravipudi New Movie : భగవంత్ కేసరి బ్లాక్ బాస్టర్ హిట్​ అవ్వడం వల్ల దర్శకుడు అనిల్ రావిపూడి నెక్ట్స్​ ఎవరితో సినిమా చేయబోతున్నారా అనే ఆసక్తి అప్పుడే మొదలైపోయింది. ఆ వివరాలు..

Anil Ravipudi New Movie : 'భగవంత్ కేసరి' బ్లాక్ బాస్టర్​ అయిపోయింది​.. ఇక అనిల్​ నెక్ట్స్​ సినిమా ఎవరితోనంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 8:53 AM IST

Anil Ravipudi New Movie : దర్శకుడు అనిల్​ రావిపూడి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే పేరు వినిపిస్తోంది. అందుకు కారణం 'భగవంత్ కేసరి'. తాజాగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​ బాస్టర్ టాక్​తో అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. చిత్రంలో ఆడపిల్లల గురించి మంచి సోషల్​ మెసేజ్​ ఉండడం వల్ల అనిల్ పేరు మార్మోగిపోతుంది.

తన తొలి చిత్రంతోనే పటాస్‌ అనిపించిన అనిల్‌ రావిపూడి... సినిమాలో ఫన్‌ అయినా ఫ్రస్ట్రేషన్‌ అయినా మంచిగా చూపిస్తూ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తారు. తెరపై హీరోయిజాన్ని ఆవిష్కరించడంలోనూ సరిలేరు నీకెవ్వరు అనేంతగా ప్రభావం చూపించారు. అందుకే తక్కువ సమయంలో స్టార్‌ దర్శకుడిగా మారిపోయారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాప్ డైరెక్టర్ల లిస్ట్​లోకి యాడ్ అయిపోయిన అనిల్... ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరితోనూ మరో మెట్టు ఎక్కారు. ఈ చిత్రం అభిమానులకు చాలా చాలా నచ్చేసింది. అప్పుటివరకు కామెడీ ట్రాక్​తో హిట్లను అందుకున్న అనిల్​.. తొలిసారి సమాజానికి ఉపయోగపడే సోషల్ మెసేజ్ ఇచ్చి అభిమానుల మనసును తాకారు.

Anil Ravipudi Raviteja Movie : దీంతో అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఆయన ఏ హీరోతో సినిమాను చేయబోతున్నారు? ఎలాంటి కథతో రానున్నారు? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్​ మళ్ళీ తనకు హిట్ ఇచ్చిన హీరోతోనే సినిమాకు కమిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్​ మాహారాజా రవితేజతో మరో సినిమాకు కమిట్ అయినట్లు ప్రచారం ఎక్కువ సాగుతోంది.

ఫుల్ టు ఫుల్ మాస్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్​గా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఇక ఈ వార్త తెలుసుకుంటున్న అభిమానులు.. మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు గానీ ప్రస్తుతానికి ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagvant Kesari Sequel : 'భగవంత్‌ కేసరి' సీక్వెల్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి

యంగ్​ హీరోస్​ టు సీనియర్ కథానాయకులు.. ఇప్పుడందరూ అదే పాత్రలో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.