యాంకరింగ్ గురించి ఓ పుస్తకం రాస్తే అందులో సగానికి పైగా ఆమె గురించే ఉంటుంది. టీవీల్లోనూ, ఈవెంట్స్‌లోనూ మల్టీ టాలెంట్డ్ స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది. తరాలు మారుతున్న ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె కామెడీ టైమింగ్, పంచ్‌ల పవర్‌కి పెద్ద పెద్ద కమెడియన్స్ సైతం అవ్వాకైపోతారు. అందుకే ఆమె షోలో ఉంటే టీఆర్పీ రేసు గుర్రంలా పరిగెడుతుంది. ఇక ఆమె యాంకరింగ్‌కు చిన్న పిల్లాడి నుంచి పెద్ద వయసు ఉన్న వారు కూడా ఫిదా అయిపోతుంటారు. ఇంతకీ ఆమె ఎవరో అర్థమైపోయింది కదా. ఆమెనె సుమ. అయితే ఆమెకు ఓ కుర్రాడు స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. సుమ యాంకరింగ్‌లో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో 'క్యాష్'.. దొరికినంతా దోచుకో.. ఈ వారం ఎపిసోడ్‌కు క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్, హరి తేజ అతిథులుగా వచ్చారు. సుమ 'ఫిల్మ్ స్కూల్' పేరుతో ఓ గేమ్ కండక్ట్ చేసి కామెడీ పండించారు. ఇక ప్రభాస్ శ్రీనును రొమాంటిక్ సీన్ డైరెక్ట్ చేయాలంటే.. అంతా గందరగోళం చేసి నవ్వులు పూయించాడు.
ఈ క్రమంలోనే సుమ.. కంటెస్టెంట్లకు మరో టాస్క్ ఇచ్చింది. తాను చెప్పిన హావభావాలను పలికించాలని చెప్పింది. అలా హరితేజకు రకరకాలుగా ఏడవాలనే టాస్క్ ఇవ్వగా.. అప్పుడు హరి షోకి వచ్చిన ఆడియన్స్‌తో చేయిస్తా అంటూ ఒక అమ్మాయికి చెప్పి చేయించింది. అది బాగా నవ్వులు పూయించింది.
తర్వాత ప్రవీణ్‌కి లవ్ ప్రపోజ్ చేసే టాస్క్ ఇచ్చింది. పార్క్‌లో ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది. వెళ్లి ఐ లవ్ యు చెప్పాలని చెప్పింది. ఈ టాస్క్ కూడా షో ఆడియన్స్‌లో ఒక అబ్బాయితో ప్రవీణ్ చెప్పి చేయించాడు. అలా సుమను లవర్‌గా భావించి ఐ లవ్ యు చెప్పాలని ప్రవీణ్ ఆ అబ్బాయి చెప్పాడు.
దీంతో సుమ వద్దకు వెళ్లిన ఆ కుర్రాడు... మిమ్మల్ని చాలా రోజులుగా ఫాలో చేస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ అని చెప్పాడు. 'నువ్వు మా అబ్బాయి క్లాస్ మేట్ కదా' అంటూ సుమ వెంటనే టైమింగ్ పంచ్ వేసింది. దీంతో షోలో ఉన్నవారంగా పక్కున నవ్వేశారు. సుమ టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్‌కి నవ్వులు పూయించింది అలా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఫన్నీ ఫన్నీగా ఎంటర్టైనింగ్గా సాగింది. డిసెంబరు 3న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: దేవీశ్రీ నా వల్లే ఈ స్థాయికి.. తమన్ జీరో..: మెలోడీ బ్రహ్మా మణిశర్మ