ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన చిత్రం 'కాంతార'. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మొదట కన్నడలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లోనే పాన్ ఇండియా మూవీగా అందరి ఆదరణ పొందింది. రూ.15 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు చేసి అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా స్టార్ యాంకర్ అనసూయ కాంతార సినిమా గురించి మాట్లాడారు.
కాంతారలో హీరో నటనపై అనసూయ మాట్లాడుతూ..'ఈ సినిమాలో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించారు. ఆయన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దానిలో నుంచి బయటపడలేకపోతున్నా" అని చెప్పింది. నిజానికి చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదే. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలోని 'ఓఁ' అనే సౌండ్ కొన్ని నిమిషాల పాటు వెంటాడుతుందని అంతగా ఈ శబ్దం ప్రభావం చూపుతుందని అంటారు. ఇదే విషయాన్ని అనసూయతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇటీవల ఈ హీరోను ప్రత్యేకంగా కలిసి అభినందించిన విషయం తెలిసిందే. ఇక యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. 'పుష్ప2'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.