Anasuya Latest Instagram Post : అనసూయ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ కూడా. ఒకప్పుడు ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్‌లో యాంకర్‌గా అలరించిన ఈ బొద్దుగుమ్మ.. జబర్దస్త్ షోతో ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలో బిజిబిజీగా మారిపోయింది. 'రంగస్థలం', 'పుష్ప' వంటి చిత్రాలతో విలక్షణ నటిగా మారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటోంది. దీంతో బుల్లితెరకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది.
Anasuya Latest Movie Name : రీసెంట్గా 'విమానం' అనే ఎమోషనల్ డ్రామా సినిమాలో వేశ్యగా నటించి అలరించింది అనసూయ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే మరోవైపు సోషల్ మీడియాలోనూ మొదటి నుంచి ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. పొట్టి పొట్టి డ్రెస్సులో కుర్రాకారును టెంప్ట్ చేస్తుంటుంది. అలాగే కాంట్రవర్సీ ట్వీట్ల్ చేస్తూ నెటిజన్లతో గొడవకు దిగుతుంటుంది.
అయితే గత కొద్ది రోజులుగా ఆమెలో మార్పులు కూడా వచ్చాయి. సోషల్‌మీడియాలో కాంట్రవర్సీ ట్వీట్స్ ఆపేసి ఫ్యామిలీతో కలిసి సరదాగా దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ వారితో కలిసి హ్యాపీగా గడపుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే రీసెంట్గా మళ్లీ ఏడుస్తున్న ఓ వీడియో పోస్ట్ చేసి షాక్‌కు గురి చేసింది. మరో వీడియో పోస్ట్ చేసి అలా తాను ఎందుకు ఏడ్చానో క్లారిటీ కూడాఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ చేసింది. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. ఈ పెట్సే నా ఫేవరెట్ వ్యక్తులు.. డాగ్ మామ్ లైఫ్‌లో అత్యంత సంతోషంగా జీవించేది నేనే అంటూ రాసుకొచ్చింది.
Anasuya Upcoming Movies List : అనసూయ తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ సినిమా అవకాశాలను అందుకుంటోంది. దర్శకుడు సుకమార్ తెరకెక్కిస్తున్న అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో పాటు.. ప్రభుదేవా నటిస్తున్న వుల్ఫ్ సినిమాలో నటిస్తోంది. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
అనసూయలో ఈ మార్పు ఏంటి గురూ.. ఫ్రీడమ్ ఫైటర్‌గా మారిపోయిందిగా