ETV Bharat / entertainment

ఉసురు ఊరికే పోదని అనసూయ ట్వీట్, ఎవరినుద్దేశించంటూ నెట్టింట చర్చ - అనసూయ భరద్వాజ్​ న్యూస్

anasuya bharadwaj latest tweet సోషల్​ మీడియాలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తుంటారు వ్యాఖ్యత, నటి అనసూయ. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్​ నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎవరినుద్దేశించి అలా రాశారో అంటూ నెట్టింట చర్చ సాగుతోంది.

anasuya bharadwaj latest tweet
anasuya bharadwaj latest tweet
author img

By

Published : Aug 25, 2022, 10:58 PM IST

Anasuya bharadwaj latest tweet: వ్యాఖ్యాత, నటి అనసూయ.. తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా నిర్మొహమాటంగా తెలియజేస్తుంటారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్‌ నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎవరినుద్దేశించి అలా రాశారో? అంటూ నెట్టింట చర్చ సాగుతోంది. "అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా!!' అని అనసూయ తెలుగులో రాసి, #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లు జతచేశారు. 'ఇతరుల బాధని చూసి ఆనందపడను కానీ నమ్మకం నిజమైంది' అని అనసూయ ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియక చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 'ఏం జరిగింది మేడమ్‌?', 'అర్థంకావట్లేదు', 'ఏదో సినిమా సంభాషణలా ఉందేంటి!', 'ఎవరిని? ఎందుకు అంటున్నారో స్పష్టత ఇవ్వండి' అని అడుగుతున్నారు.

వ్యాఖ్యాతగా పలు కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ నటిగానూ ఆకట్టుకున్నారు. నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా', 'క్షణం', రామ్‌చరణ్‌ 'రంగస్థలం' తదితర చిత్రాల్లో పోషించిన విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల, అల్లు అర్జున్ హీరోగా గతేడాది వచ్చిన 'పుష్ప' చిత్రంలో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈమె కీలక పాత్ర పోషించిన 'రంగ మార్తాండ' త్వరలో విడుదల కానుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రధారులు.

ఇవీ చదవండి: కేజీఎఫ్​ నటుడికి క్యాన్సర్​, సాయం కోసం ఎదురుచూపులు

అదుర్స్‌ అనిపించేలా ది ఘోస్ట్‌ ట్రైలర్‌, ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో నాగార్జున

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.