ETV Bharat / entertainment

''సర్కారు వారి పాట'లు అదుర్స్​'.. 'ఆచార్య' కామెడీ ప్రోమో రిలీజ్​ - అశోకవనంలో అర్జున కళ్యాణం

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్​ ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి. అయితే పాటలన్నీ ప్రేక్షకులకు షడ్రుచులు పంచుతాయని వాటిని రాసిన రచయిత అనంత్​ శ్రీరామ్​ తెలిపారు. మరోవైపు, ఆచార్య కామెడీ ప్రోమోను చిత్రబృందం రిలీజ్​ చేసింది.

sarkaru-vari-paata-songs-and-acharya-comedy-promo-released

author img

By

Published : May 1, 2022, 9:06 PM IST

Ananth Sriram About Sarkaru Vari Paata Songs: పరుశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్​తో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఇంటర్నెట్​ను షేక్​ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులకు షడ్రుచులు పంచుతాయని ఆ పాటలు రాసిన గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అన్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర విశేషాలు, పాటల విశిష్టతను వివరించారు. ఈ సారి మహేశ్ బాబు అరుదైన కథను ఎంచుకున్నారని, దేశానికి మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరేలా సర్కారు వారి పాట ఉంటుందని అనంత్ శ్రీరామ్ తెలిపారు.

'సర్కారు వారి పాట' గురించి విశేషాలు చెబుతున్న అనంత్​ శ్రీరామ్​

Ashoka Vanamlo Arjuna Kalyanam Prank Video: యువ కథానాయకుడు విశ్వక్ సేన్ నటించిన చిత్రం 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఫిల్మ్ నగర్​లో విశ్వక్ సేన్ వాహనానికి ఎదురుపడి 10 నిమిషాల పాటు నానా హంగామా చేశాడు. 'అల్లం అర్జున్ ఎక్కడా?' అని ప్రశ్నిస్తూ.. తనకు పెళ్లి కావడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న విశ్వక్ సేన్.... ఆ కుర్రాడిని సముదాయించి తన కారులో ఎక్కి పంపించారు. ఆ తర్వాత విశ్వక్ సేన్ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్​లో భాగంగానే చేశారని చిత్ర బృందం ప్రకటించింది. కానీ బహిరంగ ప్రదేశంలో సినిమా ప్రచారం కోసం యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రచారం కోసం ఇలా ప్రవర్తించాలా అంటూ సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. సినిమా బాగుందంటే చూస్తారు, లేదంటే లేదని వాపోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhala Tandana Trailer Release: యువ హీరో శ్రీవిష్ణు, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భళా తందనాన'. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్​ను విడుదల చేసింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో కేథరిన్ నటించగా.. గరుడ రామ్ ప్రతినాయకుడిగా బలమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్​ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.

Acharya Comedy Promo Released: మెగా హీరోలు కీలక పాత్రల్లో నటించిన సినిమా ఆచార్య. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే కాస్త నెగటివ్ టాక్​ సంపాదించుకుంది. క‌థ బాగానే ఉన్న క‌థ‌నం కొత్త‌గా లేద‌ని, కొర‌టాల మార్కు ఈ చిత్రంలో క‌నిపించ‌లేద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ.34.65 కోట్ల షేర్‌ను సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్​ కామెడీ ప్రోమోను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి సెక్యూరిటీ ఆఫీస‌ర్ల గెట‌ప్‌ల్లో వ‌చ్చి విల‌న్లను చంపుతూనే కామెడీ పండిస్తారు. ఈ సీన్ మాత్ర‌మే ఆచార్య‌లో హైలైట్‌గా ఉంద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌పడ్డారు. మూడేళ్ల త‌ర్వాత మెగాస్టార్‌ను వెండితెర‌పై చూడ‌బోతున్నాం అనే ఆశ‌తో వ‌చ్చిన అభిమానుల‌ను ఈ చిత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం ఓటీటీలో కూడా మే చివ‌రి వారంలోపు స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీని మ్యాట్నీ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు.

ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నేచురల్​ బ్యూటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.