ETV Bharat / entertainment

తారకరత్న హీరోయిన్​ షాకింగ్ లుక్​.. గుర్తుపట్టలేనంతగా ఇలా అయిపోయిందేంటి? - శ్రీదేవిడ్రామాకంపెనీ లేటెస్ట్ ప్రోమో రేఖవేదవ్యాస్​

Anandam Okato Number Kurradu Heroine Rekha Vedavyas : 'ఆనందం', 'ఒకటో నెంబర్‌ కుర్రాడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన హీరోయిన్​ రేఖ. చాలా ఏళ్ల తర్వాత షాకింగ్ లుక్​లో కనిపించింది.

తారకరత్న హీరోయిన్​ షాకింగ్ లుక్​.. గుర్తుపట్టలేనంతగా ఇలా అయిపోయిందేంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 10:23 PM IST

Anandam Okato Number Kurradu Heroine Rekha Vedavyas : 'ఆనందం', 'ఒకటో నెంబర్‌ కుర్రాడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన హీరోయిన్​ రేఖ. చాలా ఏళ్ల తర్వాత షాకింగ్ లుక్​లో కనిపించింది. కర్నాటకకు చెందిన ఈమె పూర్తి పేరు రేఖ వేదవ్యాస్‌. 2001లో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆనందం' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్​.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడిగా శ్రీనువైట్లకు కూడా మంచి పేరు వచ్చింది.

ఆ తర్వాత 'జాబిలి', నందమూరి తారకరత్నతో 'ఒకటో నెంబర్‌ కుర్రాడు' చిత్రంలో నటించింది. ఈ చిత్రం తారకరత్నకు కూడా మంచి హిట్ ఇచ్చింది. అనంతరం 'దొంగోడు', 'జానకి వెడ్స్ శ్రీరామ్‌', 'ప్రేమించుకుందాం పెళ్లికి రండి', 'నాయుడమ్మ', 'నిన్న నేడు రేపు' చిత్రాలు చేసింది. 2008లో వచ్చిన 'నిన్న నేడు రేపు' ఆమె చివరి తెలుగు చిత్రం. 'జానకి వెడ్స్ శ్రీరామ్' తర్వాత పెద్దగా సక్సెస్‌లు రాకపోవడంతో కన్నడ చిత్రాలకే పరిమితమైంది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్​ను అందుకుంది.

తాజాగా దాదాపు పదిహేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించింది. అయితే అది బుల్లితెరపై. ఆ మధ్య అలీ హోస్ట్​గా వ్యవహరించిన 'అలీతో సరదాగా' షోలో కనిపించగా.. మళ్లీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సడెన్​గా కనిపించి షాకిచ్చింది. అప్పట్లో బొద్దుగా, అందంగా ఉండే ఈమె.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సన్నగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెలా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ షోలో ఆమె వచ్చీ రాగానే నవ్వులు పూయించింది. బుల్లెట్‌ భాస్కర్‌పై పంచ్​లు వేసింది. ఈ క్రమంలోనే నటి, జడ్జి ఇంద్రజ.. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడటం చాలా ఆనందంగా ఉందంటూనే.. కానీ ఇలా చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పింది. దీనికి రేఖ కూడా వివరణ ఇచ్చింది. తనకు ఏం అయిందో చెప్పింది. ఆమెకు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారం అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అనన్య పాండే.. సైలెంట్​గా రూ.100 కోట్లు వసూలు చేసేసిందిగా!

Sai Pallavi Bollywood Movie : ఆ స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. షూటింగ్ కూడా షురూ అయిందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.