ETV Bharat / entertainment

అమితాబ్​, అనుష్కకు లిఫ్ట్​.. బైకర్లకు పోలీసులు షాక్​.. రూ.10వేలు కట్టాలంటూ.. - Mumbai Police impose fine on Amitabh Bachchan

బాలీవుడ్ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, అనుష్క శర్మకు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు బైకర్లకు ముంబయి పోలీసులు గట్టి షాక్​ ఇచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులపై జరిమానా విధించారు. పోలీసుల ఫైన్​కు అసలు కారణం ఏంటంటే?

అమితాబ్​, అనుష్కకు లిఫ్ట్​.. బైకర్లకు పోలీసులు షాక్​.. రూ.10 వేలు కట్టాలంటూ!

author img

By

Published : May 17, 2023, 6:28 PM IST

Updated : May 17, 2023, 6:40 PM IST

ముంబయి, బెంగళూరు, హైదరాబాద్​ వంటి మహా నగరాల్లో ట్రాఫిక్​ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక ఆఫీస్​ టైమింగ్స్​లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్​లో చిక్కుకున్నామంటే చాలు.. గంటలు తరబడి వెయిట్​ చేయాల్సిందే. ఎంత అర్జెంట్​ పని ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. చాలా సార్లు హీరోహీరోయిన్లకు, నటీనటులకు కూడా ఆ బాధ తప్పడం లేదు. షూటింగ్​ సెట్​కు వెళ్లాల్సిన సమయం దగ్గరపడుతున్నా.. ట్రాఫిక్​ తగ్గకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. తమ కార్లలోనే వెయిట్​ చేస్తున్నారు.

ఇటీవలే ముంబయి నగరంలో భారీ ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు బాలీవుడ్ బిగ్​ బి అమితాబ్‌ బచ్చన్‌, స్టార్​ హీరోయిన్​, క్రికెటర్​ విరాట్​ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.. షూటింగ్​కు టైమ్​ అయిపోతుందని తమ కార్లు వదిలి బైక్‌పై ప్రయాణించారు. వేగంగా తమ షూటింగ్​ సెట్లకు చేరుకునేందుకు వేర్వేరు సందర్భాల్లో వారు ఇతరుల బైక్‌ను ఆశ్రయించారు. అయితే వారిద్దరికి లిఫ్ట్​ ఇచ్చిన ఇద్దరు బైకర్లకు ముంబయి పోలీసులు షాక్​ ఇచ్చారు. ఫైన్​ విధించారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ట్రాఫిక్ విభాగం జరిమానాలు విధించింది.

అమితాబ్​, అనుష్కకు లిఫ్ట్​.. బైకర్లకు పోలీసులు షాక్​.. రూ.10 వేలు కట్టాలంటూ!
అమితాబ్​, అనుష్కకు లిఫ్ట్​.. బైకర్లకు పోలీసులు షాక్​.. రూ.10 వేలు కట్టాలంటూ!

ఇటీవల అమితాబ్ బచ్చన్​.. ఓ సామాన్యుడి బైక్‌పై షూటింగ్‌ స్థలానికి వెళ్తూ ముంబయి వీధుల్లో కనిపించారు. తనకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి నెట్టింట స్పెషల్​ థ్యాంక్స్‌ చెప్పారు. "నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్‌ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు" అంటూ అతడికి అమితాబ్​ ధన్యవాదాలు చెప్పారు. ఇదే విధంగా అనుష్క కూడా కారులో స్టూడియో వెళ్తుంటే.. చెట్టు పడిపోవడం వల్ల దారి అంతా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ఆమె కూడా ఓ వ్యక్తి బండి మీద స్టూడియోకు చేరుకున్నారు.

అయితే ఈ రెండు సంఘటనలు నెట్టింట తెగ వైరల్​ అయ్యాయి. పని పట్ల వీరికున్న నిబద్ధతను కొందరు ప్రశంసించారు. కానీ మరికొందరు మాత్రం బైకర్లు.. హెల్మెట్లు ధరించలేదని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు స్పందించారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ విభాగానికి తెలియజేస్తామని చెప్పారు.

ఇప్పుడు ముంబయి ట్రాఫిక్‌ పోలీసు విభాగం రంగంలోకి దిగింది. అమితాబ్​, అనుష్కకు లిఫ్ట్​ ఇచ్చిన ఆ బైకర్లకు జారీ చేసిన చలాన్లను ట్విటర్ వేదికగా షేర్‌ చేసింది. అనుష్కకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి రూ.10,500 చలానా విధించింది. అమితాబ్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై జరిమానా పడింది. అయితే ఆ మొత్తంపై స్పష్టత లేదు.

Last Updated : May 17, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.