ETV Bharat / entertainment

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో అమితాబ్‌ సందడి.. ఫొటో​ వైరల్​ - అమితాబ్​ ప్రాజెక్ట్​ కె

Amitab bachan metro rail: దిగ్గజ నటుడు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌.. రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. ప్రాజెక్ట్​ కె షూటింగ్​లో భాగంగా అక్కడ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ ఆయ్యాయి.

Amitab bachan metro rail
హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో అమితాబ్‌
author img

By

Published : Jun 30, 2022, 11:31 AM IST

Updated : Jun 30, 2022, 12:07 PM IST

Amitab bachan metro rail: 'ప్రాజెక్ట్​ కె'లో భాగంగా దిగ్గజ నటుడు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. ట్రైన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయన్ను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. సాధారణంగా రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో మెట్రో స్టేషన్‌ మొత్తం ఖాళీగా, కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్రబృందంతోనే కనిపించిందని రాసుకొచ్చారు.

కాగా, ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Amitab bachan metro rail
హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో అమితాబ్‌

అమితాబ్‌-ప్రభాస్‌ ఆఫీస్‌ ఓపెనింగ్‌.. 'వైజయంతి మూవీస్‌' కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయ ప్రారంభోత్సవంలో రాఘవేంద్రరావు, అమితాబ్‌ బచ్చన్‌, ప్రశాంత్‌నీల్‌, ప్రభాస్‌, నాని, దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో కొన్నిరోజుల క్రితం నెట్టింట చక్కర్లు కొట్టగా.. బుధవారం దీనికి సంబంధించి ఓ వీడియోను వైజయంతి మూవీస్‌ షేర్‌ చేసింది. అమితాబ్‌, ప్రభాస్‌.. రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయాన్ని ప్రారంభించడం.. ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఆనాటి ఫొటోలను అమితాబ్‌ ఆసక్తిగా తిలకించడం.. యువ నటులు, దర్శకులతో బిగ్‌బి సరదాగా ముచ్చటించడం.. ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ వీడియో రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Shruti Hassan: ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా..

Last Updated : Jun 30, 2022, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.