ETV Bharat / entertainment

హాట్​ టాపిక్​గా 'పుష్ప' గోరు సస్పెన్స్​.. దీని వెనక ఉన్న కథ ఇదేనా? - హాట్​టాపిక్​గా పుష్ప గోరు సస్పెన్స్

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ నటించిన 'పుష్ప' టీజర్​ ప్రస్తుతం ఇండియా వైడ్​గా సెన్సేషన్​గా మారింది. ముఖ్యంగా ఈ టీజర్​లో పుష్ప చిటికిన వేలుకు ఉన్న గోరు హైలైట్​గా నిలిచింది. అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆ వివరాలు..

Puspha nail suspense
హాట్​టాపిక్​గా 'పుష్ప' గోరు సస్పెన్స్​.. దీని వెనక ఉన్న కథ ఇదేనా?
author img

By

Published : Apr 8, 2023, 8:57 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే 'పుష్ప: ది రూల్​' మూవీటీమ్​ అదిరిపోయే ట్రీట్​ ఇచ్చింది. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న 'వేరీజ్ పుష్ప' టీజర్​ను రిలీజ్​ చేసింది. అది ఇప్పుడు ఇండియా మొత్తం సెన్సేషన్​గా మారిపోయింది. ఈ వీడియో అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్​తో దూసుకుపోతోంది. అదిరిపోయే క్రేజ్​ను సొంతం చేసుకుంది. ఇది చూసిన సినీ ప్రియులు, అభిమానులు.. టీజర్​ అదిరిపోయిందంటూ సోషల్​మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్గెస్ట్​ సెన్సేషన్ 'పుష్ప 2'నే అని అంటున్నారు.

మొత్తంగా ఈ పుష్ప 2 టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ లోగో.. ఇలా అన్నీ సినిమాపై అంతకుమించి అంచనాలను, అలానే అనుమానాలను పెంచేశాయి. అయితే ఈ వీడియో మొత్తం అల్లు అర్జున్​ ఎక్కడ ఉన్నాడంటూ అనే పాయింట్​తోనే సాగింది. చివర్లో.. జైలు నుంచి తప్పించుకున్న పుష్ప రాజ్​ ఓ అడవీ ప్రాంతంలో తలదాచుకుంటున్నట్లు చూపిస్తారు. నైట్ విజన్ కెమెరాలో పులి పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్లే పుష్పను చూపించారు. అయితే అక్కడ అతడు తన మార్క్ స్టైల్​లో గడ్డం నిమురుకుంటూ తగ్గేదే లే అంటూ కనపడతాడు. ఆ సమయంలో అతడి చిటికెన వేలు గోరు మాత్రం నైల్ పాలిష్​తో బారుగా కనిపిస్తోంది. ఇదే ప్రతిఒక్కరి మెదడులో అనుమానాన్ని రేపుతోంది. దీన్ని చూసిన వారందరూ అదొక్కటే ఎందుకు స్పెషల్​గా చూపించారు అంటా తెగ ఆలోచిస్తున్నారు. దాని గురించే చర్చిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేశారు. ఇందులో పుష్ప రాజ్​.. శత్రువులను చంపేందుకు మారువేషంలో అమ్మోరులా చూపించారు. ఎవరూ ఊహించని ఈ లుక్​లో అల్లు అర్జున్ ఎంతో పవర్​ఫుల్​గా కనిపించారు.

అలా ఈ రెండు విషయాల వల్ల పుష్ప ఈ సినిమాలో మారువేషాల్లో ఉంటూ శత్రువులను వేటాడం, అలా పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుంటాడని భావిస్తున్నారు. ఇందులో భాగంగా హిజ్రా గెటప్​ కూడా వేసి ఉంటాడని, అందుకే ఆ నైల్​ పాలిష్​ గోరు ఉందని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ దర్శకుడు సుకుమార్ చిటికెన వేలు గోరుతో.. మంచి సస్పెన్స్​ క్రియేట్​ చేశారు.

డ్రాగన్​ లోగో.. ఇంకా ఈ టీజర్ పుష్ప.. చైనా, జపాన్, మలేషియా దేశాలకు పారిపోయాడా అని కూడా అంటుంటారు. అయితే 'పుష్ప' ఫస్ట్ పార్ట్​లో.. చైనా, జపాన్ ప్రస్తావన కూడా ఉంటుంది. స్మగ్లింగ్ ఎర్ర చందనాన్ని అక్కడికే తరలిస్తుంటారు. కాబట్టి 'పుష్ప 2' టైటిల్ లోగో గమనిస్తే.. అందులో గ్రీన్ కలర్​లో డ్రాగన్ తరహా డిజైన్ కనిపిస్తుంది. డ్రాగన్ అంటే చైనా అని అర్థమస్తుంది. కాబట్టి కథ చైనాలో కూడా సాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కేవలం పాన్ ఇండియా మాత్రమే.. పాన్ వరల్డ్​గా తీర్చిదిద్దేందుకు సుకుమార్​ గట్టిగానే ప్లాన్​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: RGVతో ఉన్న ఈ బ్యూటీ భలే ఉందిగా.. ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.