Allarinaresh Itlu Maredumilli Prajanikam movie teaser: నటుడు అల్లరినరేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఆనంది కథానాయిక. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. 'ఇవన్నీ ఆదివాసీల గ్రామాలు. వీళ్లలో ఎక్కువమంది జీవితంలో ఓటు వేయని వాళ్లే ఎక్కువ', 'సాయం చేస్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు.. మీరు మనుషులు అయితే సాయం చేయండి', '90 కిలోమీటర్ల మేర అడవి, 150 కిలోమీటర్ల చుట్టుకొలత.. అక్కడికి వెలితే ఎవరూ వెనక్కి తిరిగి రారు', '25 కిలోమీటర్లు అవతలికి వస్తే గానీ.. వీళ్లెలా బతుకున్నారో మనకే తెలియలేదు. వీళ్లని చూస్తే జాలి పడాలో బాధపడాలో తెలియట్లేదు' అంటూ సంభాషణలతో సాగే ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రంలో అల్లరినరేశ్ దెబ్బలు తింటూ కనిపించారు. ఆదివాసీల ఇతివృత్తంతో సాగే ఈ చిత్రంలో.. అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. దీనిని జీ స్టూడియోస్, హర్ష మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగానే.. నాంది సినిమాతో తనకు సూపర్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు విజయ్ కనకమేడలతో తన 60వ చిత్రం చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Parampara webseries season 2 teaser: గతేడాది నెటిజన్లను అమితంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో 'పరంపర' ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్‌కు ఇప్పుడు కొనసాగింపు రానుంది. 'పరంపర2'గా వస్తున్న ఈ భాగం జులై 21 నుంచి అందుబాటులోకి రానుంది. నవీన్ చంద్ర, జగపతిబాబు, శరత్‌కుమార్, ఆకాంక్షసింగ్, ఇషాన్ వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా సీజన్-2కి సంబంధించి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా?' వంటి విషయాలకు 'పరంపర' సమాధానాలు లభించాయి. మరి కొత్త సిరీస్‌లో ఆధిపత్యపోరు ఎలా ఉంటుందో చూడాలి. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Liger Mike tison Birthday: మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ రూపొందించిన చిత్రం లైగర్. ఆగస్టు 25న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ప్రముఖ ఫైటర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. నేడు మైక్ టైసన్ పుట్టినరోజును పురస్కరించుకొని లైగర్ టీమ్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. నిర్మాతలు కరణ్ జోహర్, చార్మి తోపాటు విజయ్ దేవరకొండ, అనన్య, పూరీ... మైక్ టైసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లైగర్ సెట్ లో టైసన్ చేసిన సందడి వీడియోను అభిమానులతో పంచుకుంది
-
The WILD fire has been lit🔥#LIGER & #LigerHuntsFromAug25th TRENDING on TWITTER💥
— Puri Connects (@PuriConnects) June 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy Birthday to the Greatest Fighter on the Planet, MIKE TYSON🥊🥳#LIGERonAug25th ❤️🔥@TheDeverakonda @MikeTyson @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 pic.twitter.com/F4UlE51Kuy
">The WILD fire has been lit🔥#LIGER & #LigerHuntsFromAug25th TRENDING on TWITTER💥
— Puri Connects (@PuriConnects) June 30, 2022
Happy Birthday to the Greatest Fighter on the Planet, MIKE TYSON🥊🥳#LIGERonAug25th ❤️🔥@TheDeverakonda @MikeTyson @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 pic.twitter.com/F4UlE51KuyThe WILD fire has been lit🔥#LIGER & #LigerHuntsFromAug25th TRENDING on TWITTER💥
— Puri Connects (@PuriConnects) June 30, 2022
Happy Birthday to the Greatest Fighter on the Planet, MIKE TYSON🥊🥳#LIGERonAug25th ❤️🔥@TheDeverakonda @MikeTyson @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 pic.twitter.com/F4UlE51Kuy
Gopichand pakka commercial movie: గోపిచంద్, రాశికన్నా జంటగా మారుతి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన చిత్రం పక్కా కమర్షియల్. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు వినూత్న పద్దతుల్లో ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తోంది. ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి మూసాపేటలోని లక్ష్మికళ, శశికళ థియేటర్ల వద్ద 150 రూపాయలకే పక్కా కమర్షియల్ టికెట్లను విక్రయిస్తూ సందడి చేశాడు. దర్శక నిర్మాతలకు తెలియకుండా బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న సప్తగిరిని చిత్ర సభ్యులు పట్టుకొని మారుతీ దగ్గరికి తీసుకొచ్చారు. అనంతరం సప్తగిరి, మారుతి మధ్య సాగిన సంభాషణ నవ్వులు పూయిస్తోంది.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>
ఇదీ చూడండి: షూటింగ్ కోసం అల్లరినరేశ్ రిస్క్.. దట్టమైన అడవుల్లో 250మందితో!