ETV Bharat / entertainment

ఆస్కార్ వేడుకలకు సర్వం సిద్ధం.. తొలిసారి షాంపైన్​ కార్పెట్​పై నటీనటులు! - ఆస్కార్​ అవార్డులు 2023 సమయం

నాటు నాటు పాట ఆస్కార్‌ వేదికపై మరోసారి చిందులేపిస్తుందా?.. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు ఎవరు అందుకుంటారు?.. ఉత్తమ దర్శకుడిగా ఎవరు నిలుస్తారన్న ప్రశ్నలకు సమాధానాల కోసం యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం అయిదున్నర గంటల నుంచి ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమవుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై అవార్డు అందుకోవాలన్న ఉత్కంఠతో నటులు తమ దేశ సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

oscar awards 2023
oscar awards 2023
author img

By

Published : Mar 12, 2023, 7:04 AM IST

సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. 95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది ఆస్కార్‌ పురస్కారాల వేడుకల్లో జరిగిన చెంపదెబ్బ ఘటనను పూర్తిగా మరిచిపోయేలా..ఈ ఏడాది సంబరాలు నిర్వహించనున్నారు. 1961 తర్వాత తొలిసారిగా రెడ్‌ కార్పెట్‌కు బదులుగా షాంపైన్‌ కార్పెట్‌పై నటీ నటులు తళుకులీననున్నారు. ఈ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల్లో ఎక్కువ నామినేషన్లు దక్కించుకున్న ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంపై అందరి కళ్లు కేంద్రీకృతమై ఉన్నాయి.

హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో భారీ ఏర్పాట్ల మధ్య అకాడమీ అవార్డుల ప్రదానం జరగనుంది. జిమ్మీ కిమ్మెల్ మూడోసారి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రధానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రతి ఏడాది నటీ నటులకు స్వాగతం పలికే రెడ్‌ కార్పెట్‌ స్థానంలో ఈసారి షాంపైన్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దుతున్నారు. రెడ్‌ కార్పెట్‌ మీదుగా ఈ షాంపైన్‌ కార్పెట్‌ను వేస్తున్నారు. 1961 తర్వాత మొదటిసారిగా కార్పెట్ ఎరుపు రంగులో కాకుండా షాంపైన్‌ రంగులో ఉండనుంది.

వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు ఆస్కార్‌ పురస్కారాల కోసం షార్ట్‌లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాల్ని ఓటింగ్ ద్వారా అకాడమీ తుది జాబితాను ఎంపిక చేసింది. 95వ అకాడమీ నామినేషన్లలలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం చరిత్ర సృష్టించింది. ఏకంగా 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం కేటగిరీలో అవతార్‌, టాప్‌గన్‌, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, ది ఫేబుల్‌మ్యాన్స్‌ సహా మొత్తం పది చిత్రాలు పోటీ పడుతున్నాయి.ఉత్తమ నటుడు విభాగంలో ఆస్టిన్‌ బట్లర్‌, కొలిన్‌ ఫార్రెల్‌, బ్రెండన్‌ ఫ్రాసెర్‌, పాల్‌ మెస్కల్‌, బిల్‌ నిగీ.... ఉత్తమ నటి విభాగంలో కేట్‌ బ్లాంషెట్‌, అన్నా దె అర్మాస్‌, ఆండ్రియా రైజ్‌బరో, మిషెల్‌ విలియమ్స్‌, మిషెల్‌ యో మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను అందుకునేందుకు మార్టిన్‌ మెక్‌డొనాగ్‌, డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, టడ్‌ ఫీల్డ్‌, రూబెన్‌ ఆస్ట్లాండ్‌ పోటీ పడుతున్నారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో రెండు భారత డాక్యుమెంటరీలకు చోటు దక్కింది. ది ఎలిఫెంట్ విష్పర్స్, ఆల్ దట్ బ్రీత్స్ చిత్రాలు అస్కార్‌ బరిలో నిలిచాయి. 94వ ఆస్కార్‌ ప్రదానోత్సవంలో విల్‌ స్మిత్‌ చెంపదెబ్బ వివాదాన్ని మరిపించేలా ఈ ఏడాది వేడుకలు నిర్వహించాలని అకాడమీ కమిటీ భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.