ETV Bharat / entertainment

అల్లు అరవింద్ 'దాదాగిరీ'.. రంగంలోకి సీఎం.. చిరును అలా అన్నారని.. - రామ్​చరణ్​ అల్లుఅర్జున్​ మల్టీస్టారర్​

మెగాస్టార్​ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి తెలిపారు ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​. గతంలో చిరు కోసం ఓ వ్యక్తిని కొట్టినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ సంగతులు..

Alluarvind about chiranjeevi
చిరంజీవి అల్లుఅరవింద్​
author img

By

Published : Oct 18, 2022, 3:59 PM IST

Updated : Oct 18, 2022, 4:45 PM IST

అల్లు అరవింద్ 'దాదాగిరీ'.. రంగంలోకి సీఎం.. చిరును అలా అన్నారని..

నిర్మాత అల్లుఅరవింద్-మెగాస్టార్ చిరంజీవి​.. ఒకరు హాస్యానికి మారు పేరైనా అల్లురామలింగయ్యగా వారసుడిగా, నిర్మాతగా చిత్రసీమలో అడుగుపెట్టగా.. మరొకరు స్వయంకృషితో చిత్రసీమలో అగ్రకథానాయకుడిగా ఎదిగారు. అలాగే వీరిద్దరూ బావబామరిది అనే సంగతి కూడా తెలిసిందే. పలు సందర్భాల్లో వీరిద్దరూ ఒకరిపై మరికరికి ఉన్న అనుబంధాన్ని కూడా తెలిపారు. అయితే నిర్మాతగా ఎంతో సాఫ్ట్​గా కనిపించే అరవింద్​లో కనపడని ఓ మాస్​ యాంగిల్​ కూడా ఉంది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయాన్ని చెప్పారు. గతంలో తాను చేసిన ఓ బస్సు గొడవను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానమో మరోసారి వివరించారు. అప్పట్లో చిరంజీవి కోసం ఒకరిని కొట్టినట్లు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే బస్సు గొడవ గురించి అలీ మాట్లాడుతూ.. ఆ సమయంలో రామలింగయ్య.. అరవింద్​ కోసం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్​ను కూడా​ కలిశారని అన్నారు.

దేవీ-శ్రీదేవీ సినిమా హాళ్ల దగ్గర జరిగిన గొడవ ఏంటి? అని అలీ అడగగా.. "నేను కాలేజీలో క్లాసులో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడూ నాతో 10 మంది ఉంటారు. ఒకసారి నాకు బస్సు కండక్టర్‌తో గొడవ అయ్యింది. డ్రైవర్‌ని, కండెక్టర్‌ని దింపేసి నేను బస్సు నడిపా. అందరినీ కాలేజీల్లో వదిలిపెట్టి బస్సు ఒకచోట ఆపేసి ఇంటికి వచ్చా. నేను వచ్చిన కాసేపటికి పోలీసులు ఇంటికి వచ్చారు. నన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. మా నాన్న బెయిల్‌ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు. అలాగే ఒకసారి దేవీ థియేటర్‌ దగ్గర ఓ పెద్దాయన(చాలా మంది కాల్‌ షీట్లు చూస్తారు) చిరంజీవి గురించి అమర్యాదగా మాట్లాడారు. నాకు కోపం వచ్చి కొట్టా. ఆయనకు 13 కుట్లు పడ్డాయి. నేను ఎవరినైనా ఇష్టపడితే అంతే వాళ్లను ఒక్కమాట అన్నా ఒప్పుకోను. చిరంజీవిని ఆయన అలా మాట్లాడేసరికి తట్టుకోలేక కొట్టాను. ఆయన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకునే వాడిని కాదు" అని అరవింద్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అల్లుఅర్జున్​-రామ్​చరణ్​ కాంబోలో మల్టీస్టారర్.. టైటిల్ ఫిక్స్

Last Updated : Oct 18, 2022, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.