Venu thottempudi Alluarjun movie: ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో తెరంగేట్రం చేసే అవకాశం, అల్లుఅర్జున్ నటించిన 'దేశముదురు' సినిమా తాను చేయాల్సిందని కానీ ఈ రెండు ఛాన్స్‌లు మిస్ అయ్యాయని చెప్పారు నటుడు తొట్టెంపూడి వేణు. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ప్రచారంలో భాగంగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి, సందడి చేశారు. కార్యక్రమ వ్యాఖ్యాత ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన ఎత్తు 6.3 అడుగులని చెప్పారు. "ఎంతోమంది 'ఆలీతో సరదాగా' షోకి వెళ్తున్నారు.. నువ్వెప్పుడు వెళ్తావ్ .. వెళ్లరా" అంటూ తన తల్లి అడిగేవారని తెలిపారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన రోజుల్ని నెమరువేసుకున్నారు. అబద్ధం చెప్పి సినిమాలకు వెళ్లేవాడినని, అది తెలిసి తన తండ్రి కొట్టేవారని నాటి సంగతులు వివరించారు.
"నీ సినిమా ఆడితేనే నా మేనల్లుడివని చెప్పుకొంటా. లేదంటే చెప్పను" అని తన మావయ్య, మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు సరదాగా అనేవారని నటుడు తొట్టెంపూడి వేణు గుర్తుచేసుకున్నారు. 'ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమా తాను చేయకపోయినా దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ కలిశారని, 'దేశముదురు' కథ వినిపించారని, అన్నీ చేసి సినిమా చేయలేదంటూ తన హావభావాలతో నవ్వులు కురిపించారు.
'స్వయంవరం', 'చిరు నవ్వుతో', 'హనుమాన్ జంక్షన్', 'కల్యాణ రాముడు', 'పెళ్లాం ఊరెళితే', 'ఖుషి ఖుషీగా', 'చెప్పవే చిరుగాలి', 'గోపి.. గోపిక.. గోదావరి', 'దమ్ము' సినిమాలతో విశేష క్రేజ్ సంపాదించుకున్నారు వేణు. అనివార్య కారణంగా కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న ఈయన రవితేజ హీరోగా తెరకెక్కిన 'రామారావు'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు శరత్ మండవ రూపొందించిన ఈ సినిమా జులై 29న విడుదలకానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: మెగాస్టార్ చిరంజీవి సాంగ్స్‌కు కోహ్లీ డ్యాన్స్.. అదిరే స్టెప్పులతో హంగామా!