బాలీవుడ్ క్యూట్ అండ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంట చాలా కాలం పాటు ప్రేమలో ఈ ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లైన కొన్ని రోజులకే తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట.. తమ బెడ్ రూమ్ సీక్రెట్స్‌ను తెలిపారు.
ఈ క్రమంలోనే రణ్‌బీర్ మాట్లాడుతూ.. "అలియాతో బెడ్ షేర్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆమె ఒకలా పడుకోదు. కాళ్లు ఆ మూల.. తల ఈ మూల పెడుతోంది. ఇక నిద్రలో పాములా మెలికలు తిరుగుతూ ఉంటుంది. బెడ్ మీద మొత్తం ప్లేస్ ఆక్రమిస్తుంది. పొద్దునే లేచేసరికి నేను ఒక మూలన పడుకుంటాను. ఆమెతో చాలా కష్టం" అని చెప్పుకొచ్చాడు.
అలియా మాట్లాడుతూ.. "రణబీర్ చాలా సైలెంట్. తక్కువ మాట్లాడతాడు. ఎక్కువ వింటాడు. కొన్నిసార్లు ఆ మౌనం హాయిగా ఉంటుంది కానీ మరికొన్ని సార్లు అదే ఇబ్బంది పెడుతోంది" అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ జంట నటించిన 'బ్రహ్మస్త్ర' ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొంది.
ఇదీ చూడండి: God Father: మరో పవర్ఫుల్ సాంగ్ రిలీజ్.. చిరు యాక్షన్ సూపర్