ETV Bharat / entertainment

Akshay Kumar Indian Citizenship : భారత పౌరసత్వాన్ని పొందిన అక్షయ్ కుమార్​​.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Akshay Kumar Indian Citizenship : బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ భారత పౌరసత్వాన్ని పొందారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 'మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థాన్​వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!' అంటూ నెట్టింట ఓ పోస్ట్​ పెట్టారు. దీన్ని చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Akshay Kumar Citizenship
Akshay Kumar Citizenship
author img

By

Published : Aug 15, 2023, 12:46 PM IST

Updated : Aug 15, 2023, 2:09 PM IST

Akshay Kumar Indian Citizenship : బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ భారత పౌరసత్వాన్ని పొందారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 'మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థాన్​వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!' అంటూ నెట్టింట ఓ పోస్ట్​ పెట్టారు. దీన్ని చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2019లోనే తాను పాస్​పోర్ట్​కు దరఖాస్తు చేసుకున్నారని, కొవిడ్​ కారణంగా ఆయనకు రెండున్నరేళ్లు ఆలస్యంగా పౌరసత్వం వచ్చినట్లు అక్షయ్ వెల్లడించారు.

Akshay Kumar Citizenship Controversy: 2019 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్షయ్‌ కుమార్​ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ సమయంలో అక్షయ్​ పౌరసత్వం విషయంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అప్పట్లో విజ్ఞప్తి చేయగా.. 'ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్‌ కోసం పిలుపివ్వడం ఎంటి' అంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ విమర్మలపై స్పందించిన ఆయన అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని, పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు భారత పౌరసత్వం లభించింది.

Akshay Kumar Canadian Citizenship: అయితే తాను కెనడా పౌరసత్వాన్ని తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్‌ కుమార్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. "1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. నేను నటించిన 15 సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకోసమే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేశాను. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు ఇండియాలో ఘన విజయం సాధించడం వల్ల నాకు అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇక ఆ పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయాను కూడా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాను" అని అక్షయ్‌ వివరించారు.

3 నిమిషాల్లో 184 'సెల్ఫీ'లు.. స్టార్​ హీరో గిన్నిస్​ రికార్డు..

బాలీవుడ్​ హిట్​ సాంగ్​కు స్టెప్పులతో అదరగొట్టిన చరణ్​-అక్షయ్​.. వీడియో చూశారా?

Last Updated : Aug 15, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.